ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతాలను కలిగి ఉంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ.. ఉద్యోగుల దగ్గర్నుంచి వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరు కూడా బ్యాంకులో ఖాతా కలిగి వుంటున్నారు. అయితే ఇక బ్యాంకు అన్న తర్వాత ఎంతో మంది ఖాతాదారులు ఉంటారు. ఇకఇలాంటి ఖాతాదారుల లో ఒకే పేరు కలిగిన ఖాతాదారులు కూడా చాలా మంది ఉంటారు. అందుకే ఇలా ఒకే పేరు కలిగిన ఖాతాదారులు ఎప్పుడూ లావాదేవీలు జరిపినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేదంటే ఖాతాలోకి వెళ్లాల్సిన డబ్బులు మరొకరి ఖాతాలోకి వెళుతూ ఉంటాయి. ఇలా ఇటీవల కాలంలో  బ్యాంకు అధికారుల తప్పిదాల కారణంగా ఎంతోమంది ఖాతాలలో భారీగా డబ్బు జమ అయిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.



 ఒకరి ఖాతాలోకి వెళ్లాల్సిన డబ్బులు మరొకరు ఖాతాలోకి వెళ్లడం లాంటివి జరుగుతుంటాయి. కానీ ఆ తర్వాత అధికారులు తప్పిదాన్ని గుర్తించి ఖాతాలో ఉన్న డబ్బును రికవరీ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి. ఒక బ్యాంకులో ఇద్దరూ ఒకే పేరుమీద బ్యాంకు ఖాతాను ఓపెన్ చేశారు.  ఈ క్రమంలోనే కొన్నాళ్ల వరకూ సక్రమంగానే ఇద్దరి లావాదేవీలు జరిగాయి. కానీ ఇటీవలే అధికారులు చేసిన పొరపాటు కారణంగా ఒకరి ఖాతాలోకి వెళ్లాల్సిన డబ్బులు కాస్త మరొకరు ఖాతాలోకి వెళ్లాయి. అయితే ఇక ఈ తప్పిదాన్ని అధికారులు గుర్తించారు. కానీ అప్పటికే  జరగాల్సిన నష్టం జరిగిపోయింది.


 మధ్యప్రదేశ్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్లో వేర్వేరు గ్రామానికి చెందిన హుకుం సింగ్ అనే ఒకే పేరు గల ఇద్దరు వ్యక్తులు ఒకే ఎస్బిఐ బ్రాంచ్ లో ఖాతా తెరిచారు. అయితే పేర్లు ఒకటే కావడంతో వారికి ఒకే ఖాతా ను అధికారులు కేటాయించారు. దీంతో ఒక హుకుం దా చే నగదు మరొక ఖాతాలోకి వెళ్ళిపోతున్నాయి. దీంతో మరో వ్యక్తి ఏకంగా 89000 వాడుకున్నాడు. ఖాతాల నుంచి డబ్బులు మాయం అవుతుండటంతో బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశాడు మొదటి వ్యక్తి. ఈ క్రమంలోనే ఫిర్యాదు అందుకున్న బ్యాంకు అధికారులు తప్పిదాన్ని గ్రహించి మరొక వ్యక్తిని ప్రశ్నించారు. అయితే విదేశాల నుంచి బ్లాక్ మనీ  తెచ్చి ప్రజలు ఖాతాలో వేస్తానని మోడీ చెప్పారు ఆక అలాగే వేస్తున్నారు అని అనుకున్నాను అందుకే వాడుకున్నాను అంటూ సదరు సమాధానం చెప్పడంతో బ్యాంక్ అధికారులు షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: