ఒక్కసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తర్వాత ఇక భర్త పూర్తిగా తనకే సొంతం అనుకుంటుంది భార్య. భర్తపై పరాయి మహిళ కన్ను పడిన కూడా అస్సలు సహించదు. ఇక కొన్ని కొన్ని సార్లు ఏకంగా పరాయి మహిళల విషయంలో కాస్త వైల్డ్ గా కూడా రియాక్ట్ అవుతుంటుంది. కానీ ఇక్కడ ఒక భార్య మాత్రం ఏకంగా కట్టుకున్న భర్తనే వదిలించుకునేందుకు ప్రయత్నించింది. దీనికోసం ఎవరూ చేయని పని చేసింది. ఏకంగా కట్టుకున్న భర్తనే వదిలించుకునేందుకు సొంత చెల్లిని బలి చేసింది. సొంత చెల్లి తో భర్త పెళ్లి చేయించి ఇక ఆ తర్వాత ప్రియుడితో ఉండటం మొదలు పెట్టింది.. కానీ ఆ తర్వాతే అసలు ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.



 ప్రియుడు కొన్నాళ్ల పాటు సదరు మహిళ తో ఉన్నాడు. కానీ ఆ తర్వాత నట్టేట ముంచి వదిలేశాడు. దీంతో మళ్లీ నా భర్త నాకు కావాలి అంటూ చెల్లెలి తో గొడవ పెట్టుకుంది ఆ మహిళ ఈ ఘటన. స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.. బీహార్ రాజధాని పాట్నాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పాట్నాలో నివసించే ఓ మహిళ ఆఫీసులో రఘువీర్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఇక ప్రేమ విషయం ఇంట్లో చెప్పినప్పటికీ పెళ్లికి మాత్రం ఒప్పుకోలేదు.. అదే సమయంలో వికాస్ అనే మరో యువకుడితో పెళ్లి చేశారు.. కానీ ప్రియుడిని మర్చిపోలేకపోయినా సదరు మహిళ భర్తతో కలిసి ఉండలేక పోయింది. భర్తను వదిలించుకునేందుకు ఒక ఆలోచన చేసింది. తన భర్తను చెల్లికి ఇచ్చి పెళ్లి చేయాలని భావించింది.. కుటుంబ సభ్యులందరీపై ఒత్తిడి తీసుకురావడంతో చివరికి భర్తను చెల్లితో పెళ్లి చేసింది.



 తర్వాత ప్రియుడితో కలిసి వెళ్ళిపోయింది సదరు మహిళ.. కొన్ని నెలలపాటు ప్రియుడితో సహజీవనం చేసింది. కానీ ఆ తర్వాత ప్రియుడి అసలు రంగు బయటపడింది. ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. సదరు మహిళను ఘోరంగా మోసం చేసి నడిరోడ్డుపై వదిలేసాడు ప్రియుడు. దీంతో మళ్లీ ఒంటరయిపోయింది సదరు మహిళ. దీంతో నా భర్త నాకు కావాలి అంటూ చెల్లి తో గొడవ పడటం మొదలు పెట్టింది. కానీ చెల్లి మాత్రం భర్తను తిరిగి ఇచ్చేది లేదు అంటూ తేల్చేసింది. దీంతో ఇక ఈ వ్యవహారం కాస్త వేగంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది.

మరింత సమాచారం తెలుసుకోండి: