ఇలా నేటి రోజుల్లో మనుషుల్లో మానవత్వం కరువైపోతుంది అన్న దానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. భార్యను వేధించాడు అన్న కారణంతో ఏకంగా స్నేహితులని దారుణంగా నరికి చంపాడు ఇక్కడ ఒక వ్యక్తి. ఈ ఘటన స్థానికంగా అందరినీ ఒక్క సారిగా ఉలిక్కి పడేలా చేసింది.. కర్ణాటకలోని మైసూరు నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేవలం గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు
రవి అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి మద్యం తాగాడు.. అందరూ ఫుల్లుగా మద్యం తాగిన సమయంలో మహేష్ భార్య అటువైపుగా వచ్చింది. దీంతో మహేష్ స్నేహితులు బసవ, రవి అనే ఇద్దరు కూడా మహేష్ భార్యను మాటలతో వేధించారు. అయితే గతంలో కూడా ఇలా పలుమార్లు మహేష్ భార్యను రవి బసవ లు కామెంట్ చేయడం గమనార్హం. ఇక ప్రతిసారీ ఇలానే జరుగుతుండడంతో భర్త మహేష్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు మరో స్నేహితునితో కలిసి రవి బసవని దారుణంగా కత్తులతో నరికి చంపేసాడు మహేష్.. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే హత్య చేసి అక్కడి నుంచి పరారైన నిందితులను కేవలం గంటల వ్యవధిలో పట్టుకున్నారు .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి