ఇటీవలి కాలంలో మహిళలకు వేధింపులు ఎక్కువైపోతున్నాయి. ఇక ముఖ్యంగా   సోషల్ మీడియా వేదికగా మహిళలపై జరుగుతున్న వేధింపులను తగ్గించేందుకు ఎంతోమంది సైబర్ క్రైమ్ పోలీసులు పని చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏకంగా మహిళకు రక్షణ కల్పించేందుకు పని చేస్తున్నా పోలీస్ అధికారికే సైబర్ వేధింపులు ఎదురు కావడం గమనార్హం. గుర్తు తెలియని వ్యక్తితరచూ అశ్లీల ఫోటోలు సదరు పోలీసు అధికారిణికి పంపుతున్నాడు. అయితే చివరికి మహిళా అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


 ఏకంగా పోలీస్ అధికారికే ఇలాంటి అశ్లీల వీడియోలు పంపుతు ఉండడంతో ఈ కేసును మరింత సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు . ఇక కేసు విచారణ చేపడుతున్న సమయంలో సంచలన విషయం బయటకు వచ్చింది. ఈ కేరళ రాష్ట్రంలో జరిగింది ఈ ఘటన.  అయితే అలా అశ్లీల వీడియోలు పంపుతున్న వ్యక్తిని పలుమార్లు పోలీస్ అధికారి హెచ్చరించింది. అయినప్పటికీ అతని తీరులో మాత్రం మార్పు రాలేదు. తరచూ అశ్లీల వీడియోలు ఫోటోలు పంపుతూ ఉండటంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. అయితే ఇక సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అశ్లీల వీడియోలు ఫోటోలు వస్తున్నాయి అన్న విషయాన్ని పోలీసులు కనుగొన్నారు.


 ఇక నిందితుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోయాలి అని బయలు దేరారు పోలీసులు. అక్కడికి వెళ్లి చూశాక అందరూ ఒక్కసారిగా షాక్. మహిళ పోలీస్ అధికారికి అశ్లీల ఫోటోలు వీడియోలు పంపుతున్న వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదు  అతను చిన్న గుడిసెలో నివసిస్తున్నారు మూగ చెవిటి కావడంతో అతనికి సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు కుటుంబ సభ్యులు. అత్యవసర సమయంలో కుటుంబ సభ్యులు సంప్రదించడానికి ఇక ఫోన్ కొనిచ్చారు.  అయితే నిందితుడు ఇక ఈ ఫోన్ ద్వారా ఎంతో మందికి అశ్లీల వీడియోలు ఫోటోలు పంపుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలోనే నిందితుడిని ప్రశ్నించగా తనకు మహిళా ఎస్సై ఎవరో తెలియదని ఏదో ఒక ఫోన్ నెంబర్ ఎంపిక చేసుకుని ఇలా వీడియోలు ఫోటోలు పంపుతాను అని తెలిపాడు. అతను మరోసారి ఇలా చేయకుండా అప్రమత్తంగా ఉండాలని కుటుంబ సభ్యులు హెచ్చరించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: