మనిషిలో మానవత్వం అనేది రోజురోజుకు కనుమరుగైపోతుంది. బంధాలకు బంధుత్వాలకు మనిషి ఎక్కడ విలువ ఇవ్వడం లేదు. అయితే ముఖ్యంగా కరోనా వైరస్ సమయంలో అయితే మనిషిలో ఎక్కడో మూలన దాగి ఉన్న కాస్త మానవత్వం కూడా పూర్తిగా కనుమరుగై పోయింది అని చెప్పాలి. తాను ప్రాణాలతో బ్రతికి ఉంటే చాలు సాటి మనుషులు ఏమై పోతే మనకెందుకు అనుకుంటున్నారు  మనుషులు. ఇక ప్రాణాపాయ స్థితిలో మనుషులు కొట్టుమిట్టాడుతున్న కూడా కనీసం సహాయం చేయడానికి ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పరాయి వ్యక్తుల విషయంలోనే కాదు సొంత వాళ్ల విషయంలో కూడా అమానవీయంగా వ్యవహరిస్తున్న ఘటనలు  వెలుగులోకి వస్తున్నాయి.



 రక్తం పంచుకుని పుట్టిన వారిని కూడా నడిరోడ్డుమీద వదిలేసిన ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసాయ్. కరోనా వైరస్ బారిన పడ్డారు అన్న కారణంతో ఎంతోమంది ఇక ప్రియమైన వారి మృతదేహాలను కూడా ముట్టుకోవడానికి ముందుకు రాకపోవడం మనిషి ఆలోచన తీరు ఎంత దారుణంగా మారిపోయింది అన్న దానికి నిదర్శనం గా మారిపోయాయి. బ్రతికి ఉన్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా కాస్త జాలి దయ చూపించడం లేదు ఎవరు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని వీధికుక్కలు దారుణంగా  పిక్కు తిన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.



 ఉత్తర ప్రదేశ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పార్తా పూర్ సమీపంలో చెరువు ఒడ్డున గోనెసంచిలో కట్టి ఉన్న ఓ మహిళ మృతదేహం ప్రత్యక్షమైంది. ఇక ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే అక్కడ వుండే వీధి కుక్కలు ఆ మృతదేహాన్ని పీక్కు తింటూ ఉండగా స్థానికులు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా షాకై పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ మృతదేహం ఇంట్లో వాళ్లే వదిలేసి వెళ్లారా లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: