పబ్జి అనేది జనాల మెదడును ఎంత ప్రభావితం చేసిందో ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు.. చైనా నుంచి వచ్చిన ఈ యాప్ యువత మెదడును తన ఆధీనంలోకి తెచుకుంది. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలకు ఆన్ లైన్ క్లాసెస్ పేరుతో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లను వాడుతారు. ఆ క్రమంలో చాలా మంది ఈ గేమ్ కు బానిసలుగా మారారు. అంతేకాదు.. చాలా మంది ఈ గేమ్ వల్ల ప్రాణాలను కూడా కొల్పొయారు. ఇప్పుడు మరో యువకుడు పబ్జీ ఆడవద్దు అని చెప్పిన తల్లి మీద కోపంతో గన్ తో కాల్చి చంపాడు.


ఈ దారుణ సంఘటన పశ్చిమ బెంగాల్ లో వెలుగు చూసింది. అస్మా అనే మహిళా చిన్న ఉద్యోగం చెస్తుంది..కొన్నేళ్ళ క్రితమే భర్తతో విడిపోయి.. పిల్లలతో కలిసి విడిగా ఉంటోంది. ఆమెకు 16 ఏళ్ళ కొడుకు కూడా వున్నారు. ఎప్పుడూ పబ్జి ఆడుతూ.. తల్లి చెప్పిన మాటను అస్సలు వినేవాడు. చదువును పక్కన పెట్టేసి మరీ అదే పనిలో ఉండటంతో తల్లి చాలా సార్లు మందలించింది. ఎన్ని సార్లు చెప్పినా తన తీరు మాత్రం లేదు..అతనికి ఒక అక్క కూడ ఉంది. ఆమె ఏదొక పని చేసుకుంటూ సాయంగా ఉంటుంది.


వారిద్దరి మాటలకు విసిగిపొయిన అతను గన్ తీసుకొని కుటుంబాన్ని మొత్తాన్ని కాల్చి చంపాడు. తర్వాత ఎవరో దుండగులు చంపారని నమ్మించె ప్రయత్నం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడం తో రంగం లోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.. తుపాకీ ని స్వాదీనం చేసుకున్నారు. ఆ గేమ్ ఆడటం వల్ల అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసులు తెల్చారు.ఉత్తరప్రదేశ్ లక్నోలో ఇలాంటి ఘటనే జరిగింది. పబ్జి గేమ్ ఇద్దరు మైనర్ పిల్లల ప్రాణాలు తీసింది. ఇలా చాలా మంది ఈ గేమ్ ఆడుతూ ప్రానాలను కోల్పోయారు.. ఇప్పుడు ఈ ఘటన అందరినీ కలవర పెడుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: