ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.. అది ఒక ఫేమస్ స్పా సెంటర్.. ఎంతో మంది మహిళలు అక్కడికి వచ్చి పోతూ ఉంటారు.. ఇటీవలి కాలం లో అబ్బాయిలు కూడా అక్కడ ఎక్కువగా కనిపిస్తున్నారు. దీంతో ఇక స్థానికం గా ఇదంతా గమనిస్తున్న వారికి అనుమానం వచ్చింది. స్పా సెంటర్ అనే బోర్డు కనిపిస్తున్నప్పటికీ అక్కడ ఏదో జరుగుతుంది అని అర్థమైంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. దీంతో ఇక పోలీసులు రంగ ప్రవేశం చేసి స్పా సెంటర్ లోకి వెళ్లి చూడగా అసలు నిజం బయట పడింది.
ఎవరికీ తెలియకుండా స్పా సెంటర్ అని పేరు పెట్టుకుని వ్యభిచార దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు అన్న విషయాన్ని గ్రహించిన పోలీసులు చివరికి వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకులను అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్లోని మారేడుపల్లి నర్సింగ్ హోమ్ ఎదుట జరిగింది. సెలూన్ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా లోపల వ్యభిచారం సాగిస్తున్నారు అన్న సమాచారంతో రైడింగ్ నిర్వహించిన పోలీసులు ఇక నిర్వాహకులు కిషోర్ అనీష్ లను పట్టుకున్నారు. వ్యభిచారం చేస్తున్న ఇద్దరు యువతులను ప్రజల్వ హోమ్కి తరలించిన పోలీసులు ఒక విటుడిని కూడా పట్టుకున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి