ఎంతో సంతోషం గా సాగి పోతున్న ప్రయాణాలను రోడ్డు ప్రమాదాలు ఊహించని రీతిలో విషాదం గా మారుస్తున్నాయి. ఇలా ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. కుటుంబం రోడ్డు ప్రమాదం లో చితికి పోయింది. ఎంతో సంతోషం గా l భార్యా పిల్లలతో కలిసి కారు లో బయటికి వెళ్లాడు సదరు వ్యక్తి. కానీ అలా వెళ్లడమే వారి పాలిట మృత్యువు పాశం గా మారి పోతుంది అని మాత్రం ఊహించ లేకపోయాడు. ఎంతో సంతోషం గా కార్ లో వెళుతున్న సమయం  లో ఊహించని రీతిలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికం గా ఈ ఘటన అందరిని ఒక్క సారిగా ఉలిక్కి పడేలా చేసింది.

ఇటీవల కాలం లో ఎక్కడ  చూసినా ఘోరమైన రోడ్డు ప్రమాదాలు అందరినీ ఒక్క సారిగా ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. అతివేగం రోడ్డు నిబంధనలు పాటించక పోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయ్. ఇక ఇలాంటి ఘోరమైన యాక్సిడెంట్లలో ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నాయి. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొన్న ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న  నలుగురు  అక్కడికక్కడే మృతి చెందారు. ఇక మరొకరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.అయితే మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.


 చంద్రగిరి మండలం ఐతే పల్లి జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇక ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు. కాగా ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: