భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం సహజం..అయితే వాటిని ఎంత త్వరగా అంటే అంత తొందరగా తగ్గేలా చేసుకోవాలి. భార్య మీద భర్త.. భర్త మీద భార్యకు నమ్మకం ప్రేమ అనేది ఉండాలి. లేకుంటే అంతా తారుమారు అవుతుంది. ఆ ఇద్దరి మధ్యలోకి వేరే వాళ్ళు రావడం జరుగుతుంది. అక్రమ సంబంధాల మోజులో పడి అసలు బంధాలను వదిలేస్తున్నారు. కొంతమంది వారి శారీరక సుఖాలకు అడ్డుగా వస్తున్న వారి అడ్డును తొలగించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇప్పుడు ఒక వెరైటీ ఘటన వెలుగులోకి వచ్చింది.


ప్రియురాలితో వున్న వ్యక్తికి భార్య షాక్ ఇచ్చింది. పదిమందికి ఉపయోగపడే ఓ ప్రభుత్వాధికారిగా ఉన్న ఓ వ్యక్తికి ఆల్రెడీ పెళ్ళి అయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అధికారం, డబ్బు ఉన్నాయి కదా అని అమ్మాయిలకు వల విసిరాడు. అయితే అతని వలలో ఒక అమ్మాయి చిక్కింది. ఆమె తో ప్రేమాయణం సాగించాడు.. కొద్ది రోజులు ప్రేమలో మునిగి తేలిన ఇద్దరు ఇంక శారీరకంగా కలవాలని అనుకున్నారు. అయితే ఆమె పరిచయం ఏర్పడిన తర్వాత భార్యను పూర్తిగా పట్టించుకోకుండా వచ్చాడు. ఓ రోజు ప్రియురాలిని ఇంటికి తెచ్చుకున్నాడు. భార్య ఆమె బంధువులు వచ్చి రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు.


వివరాల్లొకి వెళితే.. ఈ షాకింగ్ ఘటన బాండా జిల్లాలోని ప్రభుత్వ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌లో జూనియర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అతను తన ప్రేయసితో కలిసి ఎంజాయ్ చేస్తూ భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. తన ఇంట్లోని ఒక గదిలో  ఇద్దరూ కూర్చుని దోసను ఒకరికొకరు తినిపించుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా భార్య పట్టుకుంది. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆమెకు తోడుగా నిలిచారు. వారందరు కలిసి వారిద్దరికి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత జరిగిన విషయాన్ని పోలీసుకు సమాచారం అందించారు.. తన భర్తకు చాలా మంది మహిళలతో సంబంధం ఉందని భార్య ఆరొపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారణ మొదలు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: