ఇలా ఇటీవలి కాలం లో వెలుగు లోకి వస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఇటీవలి కాలంలో కరోనా వైరస్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఎంతోమంది దొంగలుగా మారిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. బతుకు బండిని నడిపేందుకు ఎక్కడ ఉపాధి దొరక్క పోవడంతో చివరికి కుటుంబ సభ్యుల కడుపు నింపేందుకు దొంగలుగా మారిన ఘటనలు ఎంతోమంది మనసును కదిలించాయి. ఇక్కడ ముగ్గురు మహిళలు దొంగలుగా మారారు. ముగ్గురు దొంగతనాలు చేయడానికి కారణం ఆర్థిక సమస్యలు కుటుంబ బాధ్యతలు కాదు జల్సాలు.
కూలి పని చేయడం ద్వారా వచ్చే డబ్బు తన విలాసవంతమైన జీవితానికి సరిపోవడం లేదు అంటూ భావించిన మహిళలు చివరికి చోరీలు చేయడం మొదలు పెట్టారు. సీన్ రివర్స్ అయ్యి ఇక ఇటీవల పోలీసులకు పట్టు బడ్డారు ఉమ్మడి కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసుల విచారణ లో తేలింది. రజిత అనే మహిళ తో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. ఇక ఈ కేసుపై విచారణ జరుపుతున్నారు పోలీసులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి