డేటింగ్ యాప్ లు ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి.. ఈ యాప్ ద్వారా పరిచయం అయిన కొందరు స్నేహితులుగా మారితే మరి కొంత మంది మాత్రం మోసాలకు పాల్పడుతున్నారు. డబ్బుల కోసం ఏదేదో చేస్తున్నారు. అలాంటివి ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.. ఇప్పుడు ఓ వ్యక్తికి ఈ యాప్ ద్వారా ఓ అమ్మాయి పరిచయం ఏర్పడింది.అదికాస్త ప్రేమగా మార్చింది. ఇద్దరు ఫోన్ నంబర్లను కూడా మార్చుకున్నారు. అమ్మాయి కోరిక మేరకు వీడియో కాల్ చేసిన చేసాడు. అసలు సంగతి తెలిసి షాక్ అయ్యాడు.


ఆ సమయంలో యువతి నగ్నంగా సోఫాలో కూర్చుని ఉంది.. అలాగే ఆ యువకుడితో మాట్లాడింది.. షాకైన యువకుడు కాల్ కట్ చేశాడు.. తర్వాత అతడికి టార్చర్ మొదలైంది.. ఆ వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించింది.. ఇది విన్న యువకుడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. వివరాల్లొకి వెళితే.. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది. ఓ డేటింగ్ యాప్ ద్వారా అమ్మాయి పరిచయం అయ్యింది.అది కాస్త వీడియో కాల్స్ చేసుకొనే వరకూ వెళ్ళింది. ఆ తర్వాత ఆమె అసలు రూపాన్ని బయట పెట్టింది.


ఆ వీడియోను ఇంటర్నెట్‌లో పెడతానని చెప్పి ఆ యువకుడిని బెదిరించడం మొదలు పెట్టింది. ఆ వీడియో నెట్‌లో పెట్టకూడదంటే తనకు రూ.50 వేల కావాలని అడిగింది. అతడు పేటీఎమ్ ద్వారా డబ్బులు పంపించాడు. ఆ రాత్రి అంతా ఆ యువకుడికి వరుసగా ఫోన్ల తో టాచర్ చేసింది. అతని దగ్గర మొత్తం రూ.1.80 లక్షలు కాజేసింది. మరుసటి రోజు ఫోన్ చేసి మరో రూ.50 వేలు కావాలని అడిగింది. ఆమె ఆగడాలు ఎక్కువ కావడం తో థత్తుకొల్ ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు.పూర్తీ వివరాలు తెలియాల్సి  ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: