కాలేజీ అన్న తర్వాత ఈ యువతీయువకులు ఒకరిపై ఒకరు సరదాగా కామెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది.. ఇలా సరదాగా కామెంట్ చేసుకోవడం  ఉంటేనే కాలేజీ రోజులు ఎంతో ప్రత్యేకంగా మారుతూ ఉంటాయి. అంతేకాదు ఇక కాలేజీ పూర్తయ్యాక అవే స్వీట్ మెమరీ లుగా కూడా మిగిలిపోతుంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఇలా సరదాగా ఒకరికి ఒకరు కామెంట్ చేసుకోవడమే ఒక ప్రాణం పోవడానికి కారణమైంది. ఒక అమ్మాయి అబ్బాయి మధ్య జరిగిన చిన్నపాటి గొడవలో తీవ్ర అసహనానికి గురైన యువకుడు చివరికి క్లాస్మేట్ అయిన యువతిని దారుణంగా అంతమొందించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని డెహ్రాడూన్లో వెలుగులోకి వచ్చింది.


 వనిష్క బన్సాల్ అనే యువతి ప్రస్తుతం కాలేజీ చదువుతూ హాస్టల్ లో ఉంటుంది. సాయంత్రం సమయంలో తన స్నేహితురాలితో  కలిసి బయటకి వెళ్ళింది వనిష్క. ఇంతలో క్లాస్మేట్ అయిన ఆదిత్య తోమార్ అక్కడికి వచ్చాడు. బైక్పై ఎక్కించుకునేందుకు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. దీంతో తన వెంట తెచ్చుకున్న  తుపాకీతో ఆమెను షూట్ చేసి అక్కడినుంచి పారిపోయాడు. అయితే ఈ ఘటనలో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇక నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు.


 ఈ విచారణలో భాగంగా ఊహించని నిజాలు బయటకు వచ్చాయి అని చెప్పాలి. గత కొన్ని రోజుల కిందట వనిష్క సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది. ఈ పోస్ట్ పై క్లాస్మేట్ ఆదిత్య   కామెంట్ చేశాడు. ఇక ఆ కామెంట్ నచ్చని వనిష్క తన స్నేహితులకు ఫిర్యాదు చేయడంతో అందరూ కలిసి ఆదిత్యను వనిష్క కాళ్లు పట్టుకుని  క్షమాపణ చెప్పించారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక పోయిన ఆదిత్య ఆ యువతి పై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా చంపాలని అనుకుని.. ప్లాన్ ప్రకారమే హత్య చేశాడు అనే విషయాన్ని విచారణలో ఒప్పుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: