దీంతో ఆడపిల్ల జీవితాలు ఎంతో మంది భర్తల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయి చివరికి జీవితంపై విరక్తి చెంది ఆడపిల్ల ఆత్మహత్య చేసుకున్న ఘటన లు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇటీవల సికింద్రాబాద్ లో ఇలాంటి తరహా ఘటన జరిగింది. భర్త వేధింపులు తాళలేక పోయిన భార్య చివరికి తన చిన్నారి కొడుకుతో కలిసి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది మహిళా. మహేందర్ అనే వ్యక్తికి దివ్య తేజ అనే మహిళతో పెళ్లి జరిగింది. 2018లో వీరి వివాహం జరిగింది. వీరికి ఒక బాబు రిత్విక్ ఉన్నాడు.
పెళ్లి సమయంలో నాలుగు లక్షల నగదు 10 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు దివ్య తేజ తల్లిదండ్రులు. అయితే పెళ్ళికి ముందు సీఏ చదివానని ప్రైవేట్ సంస్థలు పని చేస్తున్నా అంటూ చెప్పిన మహేందర్ పెళ్లి తర్వాత పూర్తిగా ఉద్యోగం మానేశాడు. ఉద్యోగానికి వెళ్లకపోగా ఇల్లు గడవడం కోసం అదనపు కట్నం తేవాలంటే భార్యను వేధించడం మొదలుపెట్టాడు. వివాహేతర సంబంధాలు అంటగట్టి ఆరోపణలు చేశాడు. దీంతో భర్తతో గొడవలతో మానసికంగా కుంగి పోయింది దివ్య తేజ. ఇంటికి ఎదురుగా ఉన్న నాలుగు అంతస్తుల భవనం పైకి తన కొడుకుతో వెళ్లి అక్కడి నుంచి దూకింది. దీంతో దివ్య తేజ కు తీవ్ర గాయాలయ్యాయి. కానీ చిన్నారి కొడుకు మాత్రం అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇక స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి