మహిళలపై ఎక్కడ వేధింపులు మాత్రం ఆగడం లేదు. తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన నుండి తుది శ్వాస విడిచే వరకు ఆడపిల్లలు అడుగడుగునా వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు.  బయటికి వెళ్తే ఆకతాయిలు పాఠశాలకు వెళ్తే ఉపాధ్యాయులు ఇక ఎక్కడికి వెళ్లినా కామాంధులు కోరల్లో చిక్కుకోకుండా ఎంతో జాగ్రత్త పడుతున్నారు ఆడపిల్లలు. ఇక పెళ్ళి చేసుకుని భర్తతో సంతోషంగా ఉందాం అనుకుంటే అక్కడ వరకట్న వేధింపులతో చివరికి దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇటీవలికాలంలో వరకట్న వేధింపుల కారణంగా ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వస్తున్నాయి.



 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. యూనియన్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తి భార్య చివరికి భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. అయితే భర్త ప్రవీణ్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు అంటూ మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే రెండేళ్ల క్రితం అనూష అనే యువతికి ప్రవీణ్ తో వివాహం జరిగింది. అప్పటికే ఆంధ్ర బ్యాంకులో క్లర్కుగా పని చేస్తూ ఉండేది ఇక ఆమె. భర్త ప్రవీణ్ యూనియన్ బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే వివాహ సమయంలో ప్రవీణ్ కు 25 లక్షలు నగదుతో పాటు బంగారు ఆభరణాలు కూడా ఇచ్చారు అనూహ్య తల్లిదండ్రులు. కొన్నాళ్ళ వరకు వీరి సంసార జీవితం సాఫీగానే సాగిపోతోంది.



 కానీ ఆ తర్వాత మాత్రం అదనపు కట్నం కోసం భార్యను వేధించడం మొదలు పెట్టాడు ప్రవీణ్. అంతేకాకుండా అనూష మీద అనుమానంతో ఆమెను శారీరకంగా మానసికంగా వేదింపులకు గురి చేసే వాడు అని పోలీసుల ముందు అనుష తల్లిదండ్రులు చెబుతూ కన్నీరుమున్నీరయ్యారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేసిన సరిగా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ముందుగానే స్పందించి ఉంటే తమ కూతురు బ్రతికేది అని చెబుతున్నారు అనూష తల్లిదండ్రులు. వెంటనే ప్రవీణ్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: