ఇటీవలి కాలం లో ఎంతో మంది నిర్లక్ష్యం గా చేస్తున్న డ్రైవింగ్ కాస్త ఎంతో మంది అమాయకుల పాలిట శాపం గా మారి పోతుంది అని చెప్పాలి. అంతా సాఫీగా సాగి పోతుంది అనుకుంటున్న సమయం లో కొంత మంది వ్యక్తులు నిర్లక్ష్యం గా వ్యవహరించడం చివరికి మరొకరి ప్రాణాల మీదకు తెస్తుంది. ఇలా ఇటీవలి కాలం లో అతి వేగం కారణం గా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతోంది  అన్న విషయం తెలిసిందే. అటు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.


 అయినప్పటికీ వాహనదారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఎంతో మంది నిర్లక్ష్యం గా వ్యవహరిస్తూ చివరికి  అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నారు. రోడ్డు నిబంధనలు పాటించకుండా మితి మీరిన వేగం తో వాహనం నడుపుతూ అభం శుభం తెలియని వారి ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. ఇలా ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో ఎన్నో ప్రమాదాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఇలాంటి ప్రమాదం జరిగింది. జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. దీంతో ఏకంగా ఒక బాలుడు మృతి చెందాడు.



 రోడ్ నెంబర్ 45 లో ఈ ఘటన జరగడం గమనార్హం. ఇక ప్రమాదం సమయంలో రోడ్డు దాటుతున్న మహిళ చేతిలో ఉన్న రెండు నెలల బాలుడు కిందపడి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అయితే అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన అనంతరం కారును అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. అయితే ఇక అటు ప్రమాదానికి కారణమైన కారుపై బోధన్ ఎమ్మెల్యే స్టిక్కర్ ను గుర్తించిన జూబ్లీహిల్స్ పోలీసులు ఇక కారు నెంబరు ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతూ ఉండడం  గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: