ఇక నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చుసిన తర్వాత ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా లైంగిక వేధింపులు తప్పడం లేదని అర్థమవుతుంది. అంతేకాదు ఇక వెలుగులోకి వస్తున్న ఘటనలు ఆడపిల్లల రక్షణకు ఎంతో ప్రశ్నార్థకంగానే మార్చేస్తున్నాయి. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకు ఉంటుంది. అందుకే ఉపాధ్యాయులు విద్యార్థులను తమ సొంత పిల్లల్లా భావిస్తూ ఎంతో ఓపికగా చదువు చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది ఉపాధ్యాయులు గురువు వృత్తికే కళంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు.
ఇక్కడ ఓ ప్రబుద్ధుడు ఇలాంటిదే చేశాడు. తన దగ్గర చదువుకునే విద్యార్థినులను సొంత కూతురు లాగా భావించకుండా ఏకంగా లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో సంచలనంగా మారిపోయింది. చెన్నై తిరువయ్యూరు లోని కోవై అన్న నూరు ప్రాంతానికి చెందిన పదేళ్ల బాలిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటుంది. ఇక అదే పాఠశాలలో పనిచేస్తున్నాడు మాణిక్య సుందరం అనే 47 ఏళ్ల ఉపాధ్యాయుడు. అయితే ఇక తన దగ్గర చదువుకున్న విద్యార్థులు లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో భయపడిపోయిన బాలిక ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసింది. దీంతో షాక్ అయిన ప్రధానోపాధ్యాయుడు వెంటనే పోలీసులకు చెప్పాడు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాణిక్య సుందరం ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి