ఇక ఇప్పుడు ఒక యువకుడు కూడా ఇలాగే పాములు పట్టడం ని హాబీ గా మార్చుకున్నాడు. అంతేకాదు ఇక విషపూరితమైన పాముల తో ఆడుకోవడం డాన్స్ చేయడం లాంటివి కూడా అలవాటుగా మార్చుకున్నాడు.. పాములతో ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ వాటిని సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేవాడు. ఇక ఇటీవలే తాచుపాము లను ముద్దు పెట్టుకుని వీడియోలు బాగా వైరల్ గా మారిపోయాయ్. ఈ వీడియోలు ఎంతోమందిని ఆకర్షించాయి. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి పోలీసుల వరకూ వెళ్లింది అతడు పాములను ముద్దులు పెట్టుకుంటున్న వీడియో. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు..
ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. అటవీశాఖ అధికారులు 22 ఏళ్ల ప్రదీప్ ను అరెస్టు చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేయడం గమనార్హం. మహారాష్ట్ర సాంగ్లీ లోని బాచీ కి చెందిన 22 ఏళ్ల ప్రదీప్ పాములను పట్టుకుని వాటిద్వారా స్టంట్స్ చేయడం ఇక బెట్టింగ్ వేస్తూ ఉండటం లాంటివి చేస్తూ ఉండేవాడు. ఇక ఈ విషయం చివరికి పోలీసులు వరకు వెళ్లడంతో అటవీశాఖ అధికారులు కూడా తెలియడంతో అతనిపై చర్యలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే అతన్ని అరెస్టు చేసిన పోలీసులు చివరికి కటకటాల వెనక్కి తోసాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి