దీంతో ఆడపిల్ల ఇంటి నుంచి బయటికి వెళ్లినప్పుడు మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తుందా లేదా అని తల్లిదండ్రులు కంగారు పడి పోతున్న పరిస్థితి నేటి రోజుల్లో నెలకొంది అని చెప్పాలి. ఇటీవల విజయవాడలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. అరండల్ పేట లోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ స్కూల్ ప్రమాదంలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ ఆవరణలో ఎటు చూసినా మద్యం బాటిళ్లు కనిపించాయి. దీంతో తల్లిదండ్రులు అందరూ కూడా స్కూల్కి తమ పిల్లలను పంపించాలంటే హడలెత్తిపోతున్నారు. ఇటీవలే రోడ్డుపై వెళ్తున్న ఒక బాలికను బలవంతంగా స్కూల్ లోపలికి తీసుకువెళ్ళి ఆకతాయిలు దారుణంగా సదరు బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఏకంగా అరగంటపాటు ఇక బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. అయితే చిన్నారి బాలిక కేకలు వేయడంతో చివరికి ఆకతాయిలు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఈ ఘటనలో ఆకతాయిలు నుంచి తప్పించుకునే క్రమంలో సదరు బాలిక బట్టలు మొత్తం చిరిగిపోయి ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు ఏం జరిగింది అని ఆరా తీశారు. ఈ క్రమంలోనే జరిగిన విషయం తెలిసి ఒక్కసారిగా షాకయ్యారు సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాల నేతలు కూడా డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి