తొమ్మిది నెలలు మోసి.. కన్న తల్లి ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కళ్ళల్లో పెట్టుకోని చూసుకుంటున్నారు.. అలాంటి తల్లిని చేతికి అంది వచ్చిన కొడుకులు తల్లి పై దారుణాలకు దిగుతున్నారు..కనికరం లేకుండా తల్లిని కోడుతూ హింసిస్తున్నారు. ఇప్పుడు కూడా ఓ అమానుష ఘటన వెలుగు చూసింది. కన్న కొడుకు అమ్మ మీద కోపంతో దారుణంగా కొట్టారు.. ఆ దెబ్బలకు చుట్టూ పక్కల వాళ్ళు ఆమెను ఆసుపత్రికి తరలించారు.. స్థానికుల ఫిర్యాధు మేరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఆమెను నిజం చెప్పమని ఎన్నిసార్లు అడిగిన కూడా నోరు విప్పలేదు.. అక్కడ కూడా తల్లి ప్రేమను మర్చిపోలేదు.


వివరాల్లొకి వెళితే.. ఈ దారుణ ఘటన కేరళ లో వెలుగులోకి వచ్చింది.కొల్లాంలో ఒమన అనే వృద్ధురాలు తన ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటోంది. ఈ వయసులోనూ ఆమె పనికి వెళ్లి, డబ్బు తెచ్చి కొడుకులకు ఇస్తూ ఉంటుంది. అయితే ఇద్దరు కొడుకుల్లో ఒమనకుట్టన్ అనే వ్యక్తి మాత్రం తల్లి పట్ల అమానుషంగా ప్రవర్థించాడు.మొన్నీమధ్య ఆమెను కొడుకును అతి దారుణంగా కొట్టాడు. దాంతో ఆమెకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు..


అక్కడ గాయాలు ఎలా అయ్యాయి అని డాక్టర్లు అడిగితే దానికి ఆమె అపద్దం చెప్పింది. కింద పడ్డాను అని చెప్పింది.వారు కూడా అదే నిజమనుకుని చికిత్స చేసి పంపించారు. అయితే వృద్ధురాలిపై కొడుకు దాడి చేస్తున్న సమయంలో కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లొ పోస్ట్ సమాచారం దీంతో పోలీసులకు కొందరు సమాచారం అందించారు.దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. తన కొడుకును ఏమి అనవద్దు అని వేడుకుంది వృద్ధురాలిపై కొడుకు గతంలోనూ చాలా సార్లు దాడి చేశారని చెప్పాడు. తనకు సాయం చేద్దామని చూసినా.. ఆమె నిరాకరించిందని గుర్తు చేశాడు.. అతడికీ వేరేలా బుద్ది చెప్పాలని అనుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: