ఏంటో గాని ఇటీవలికాలంలో సినిమాల ప్రభావం అటు ప్రేక్షకుల్లో బాగా పెరిగిపోతుంది. సరే మంచి సినిమాలు వస్తున్నాయి. అందులో మంచి గ్రహిస్తే బెటర్ కదా అని అనుకుంటే పొరపాటే. మంచిది కాదు అందులో చెడుకే ఎక్కువగా ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో పుష్ప సినిమాల్లో లాగానే ఎంతో మంది స్మగ్లర్లు ఆలోచిస్తూ పోలీసులకు షాక్ ఇస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇప్పుడు కేజిఎఫ్ సినిమాలో లాగానే యువకుడు చేసి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. ప్రస్తుతం కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా థియేటర్లలో దూసుకుపోతుంది. సినిమాలో విలన్ హీరో ల మధ్య తుపాకులతోనే పోరాటం ఉంటుంది


 సినిమా చూస్తున్న ఓ యువకుడు ఏకంగా ఒక వ్యక్తిని గన్ తో కాల్చేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని హవేరి లో వెలుగులోకి వచ్చింది. రాజశ్రీ సినిమా థియేటర్లు 27ఏళ్ల యువకుడు వసంత కుమార్ శివ పూర్ హీరో యష్ కి వీరాభిమాని. అయితే కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా ఇటీవల రాత్రి సమయంలో స్నేహితులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్ళాడు. సినిమా చూస్తున్న సమయంలో వసంతకుమార్ తన కాళ్ళను ముందు సీటుకు పెట్టాడు. దీంతో సీట్లో కూర్చున్న వ్యక్తి వసంతకుమార్ తో గొడవకు దిగాడు.


 ఈ క్రమంలోనే సదరు వ్యక్తి వసంతకుమార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.  ఇక అదే సమయంలో థియేటర్ బయటకు వెళ్లి పిస్తేల్ పట్టుకుని మళ్ళీ లోపలికి వచ్చాడు. ఇక వసంతకుమార్ పై రెండు సార్లు కాల్పులు జరిపాడు. ఈ క్రమంలోనే రెండు బుల్లెట్లు కడుపులోకి దిగడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఇక వసంతకుమార్ ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Gun