నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులు కాదు నరరూప రాక్షసులు అని అనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరికి. అంతేకాదు ఏకంగా సాటి మనుషులను చూస్తే భయపడే దుస్థితి ఏర్పడింది. చిన్న చిన్న కారణాలకు సాటి మనుషుల విషయంలో కాస్తయినా జాలి దయ చూపించకుండా దారుణంగా హత్యలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. మనుషుల ప్రాణాలు తీస్తే జైలు శిక్షలు పడతాయని భయం ఎవరి లో కనిపించడం లేదు. ఇటీవలే ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. కాకినాడ రూరల్ రమణయ్య పేట గ్రామ పరిధిలోని  గంజాం వారి వీధి చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.


 ఇక ఈ ఘటనతో స్థానికంగా అందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు అని చెప్పాలి. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం గైగోలుపాడు కు చెందిన సూరంపూడి దుర్గాప్రసాద్ వాసన్ శెట్టి నాగేశ్వరరావు పై దాడి చేసి దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇద్దరి కుటుంబాలు కూడా పక్కపక్కనే నివాసం ఉండటం గమనార్హం. అయితే ఇదంతా జరగడానికి వెనక పెద్ద స్టోరీ ఉన్నట్లు తెలుస్తోంది. ఏకంగా దుర్గాప్రసాద్ భార్యకు నాగేశ్వరరావు ఏం చేస్తున్నావ్ అంటూ ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఇక ఈ వాయిస్ మెసేజ్ హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది.


 అయితే భార్య ఫోన్ లో మెసేజ్ చూసిన దుర్గాప్రసాద్ కోపంతో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే  తన భార్యతో నాగేశ్వరరావుకి వివాహేతర సంబంధం ఉండవచ్చునని అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఇక నాగేశ్వరరావు ఇంటికి వెళ్ళిన దుర్గాప్రసాద్  ఇనుప రాడ్లతో దాడి చేశాడు. దీంతో నాగేశ్వరరావు తలపై బలమైన గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు నాగేశ్వరరావు. ఇక మృతుడి వదిన రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: