ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. దళిత యువకుడు విషయంలో ఇద్దరు యువకులు దారుణంగా వ్యవహరించారు. ఏకంగా మొబైల్ కొనుక్కునేందుకు ఎంతో ఆనందంగా ఆ యువకుడికి అడ్డుపడి బీరు తాగాలి అంటూ ఒత్తిడి తీసుకువచ్చారు. అయితే అతడు మాత్రం బీరు తాగేందుకు నిరాకరించడంతో ఏకంగా బీర్ లో మూత్రం పోసి బలవంతంగా తాగించారు. దీంతో ఆ యువకుడు వాంతులు చేసుకున్నాడు. ఈ ఘటన కాస్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. హర్యానాలోని బై రాంపూర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
బడాగ్ని లో వెలుగులోకి వచ్చిన ఈ అమానుష ఘటన అందరిని అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంది. దళిత యువకుడు ఫోన్ కొనుక్కోవడానికి వెళుతున్నాడు. ఈ క్రమంలోనే తుషాన్, రోహిత్ అనే ఇద్దరు యువకులు తమతో కలిసి బీరు తాగాలని అతడిని ఒత్తిడి తీసుకువచ్చారు. కానీ అందుకు మాత్రం ఆ దళిత యువకుడు నిరాకరించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన తుషాన్, రోహిత్ బీరు సీసాలో మూత్రం పోసి తాగించాడు. దీంతో అతడు వాంతులు చేసుకోవడం తో తీవ్రంగా కొట్టి ఫోన్ కొనుక్కోవడానికి తీసుకు వెళ్తున్న పదివేల రూపాయలు డబ్బులు లాక్కొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి