భార్యా భర్తల మధ్య గొడవలు రావడం సహజం..అయితే వాటిని గోటితో పోయే వాటిని గొడ్డలి తో తెంచుకొనె వరకూ తెచ్చుకొకూడదని పెద్దలు అంటున్నారు.అయితే భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు జరిగితే దానికి ఇద్దరిలో ఎవరొకరు తగ్గాలి.. లేకుంటే అవి కాస్త పెద్దవి అయితే ప్రాణాలను తీసుకొనే వరకూ వెళతాయి.ఈ మధ్య ఇలాంటి ఘటనలు చాలానె వెలుగు లోకి వస్తున్నాయి. కుటుంబాలు విడి పోయే వరకూ వెళ్లడం జరుగుతుంది. తాజాగా అలాంటి ఘటన ఇప్పుడు మరోకటి వెలుగులోకి వచ్చింది. చిన్న గొడవ కావడం తో భర్త పై కోపం తో భార్య అతని గొంతు కొరికెసింది.దాంతో అతని పరిస్థితి విషమంగా మారింది.


వివరాల్లొకి వెళితే.. బిహారల్‌లోని రోహతాస్‌ జిల్లాకు చెందిన మహర్షి సింగ్‌ అనే వ్యక్తికి 2020లో వివాహం జరిగింది. వారికి ప్రస్తుతం 10 నెలల కుమార్తె ఉంది. అయితే మొదట్లో బాగానే ఉన్న వీరి దాంపత్య జీవితంలో గత కొన్ని రోజులుగా గొడవలు మొదలయ్యాయి. ఎప్పుడూ గొడవలు జరిగిన కూడా భర్త నోటికి వచ్చినట్లు మాట్లాడే వాడు. ఎన్ని అన్నా కూడా సర్దుకు పోయేది..కానీ అతను మాత్రం ఆమెను అనరాని మాటలు అనేవాడు.ఇలా గత ఏడాది నుంచి వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.ఎవరొకరు వచ్చి ఇద్దరికీ నచ్చ చెప్పడం తో వాళ్ళు మళ్ళీ సర్దుకోనే వాళ్ళు..


గుర్రాన్ని నది వద్దకు తీసుకెల్థాము కానీ బలవంతంగా నీళ్ళు తాగించలేము కదా..మొగుడు పెల్లాల గొడవలు కూడా అంతే..బయట వరకూ మంచిగా వుండాలని అందరు చెబుతారు. కానీ బలవంతంగా కాపురం మాత్రం చెయించలెము..మళ్ళీ వీరిద్దరు గొడవ పడుతూ వస్తున్నారు.. తాజాగా ఆదివారం భార్య, భర్తల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. మాటమాట పెరగడంతో సహనం కోల్పోయిన భార్య వెంటనే భర్త గొంతును గట్టిగా కొరికేసింది.అతనికి తీవ్ర రక్త స్రావం అయ్యింది.ఆసుపత్రికి తీసుకెల్లె లోపు అతను చనిపొయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: