మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలకు దాడులు ఎక్కడ తగ్గుముఖం పట్టడంలేదు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినా మహిళల రక్షణ మాత్రం రోజురోజుకూ ప్రశ్నార్థకంగా మారిపోతోంది. నేటి రోజుల్లో ఏ ఆడపిల్ల ధైర్యంగా బయట తిరగలేని పరిస్థితి నెలకొంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దేశంలోని ఎక్కడో ఓ చోట ప్రతిరోజూ ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయ్ అని చెప్పాలి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా సెక్యూరిటీ కంపెనీలో పనిచేస్తున్న ఓ మహిళా తోటి ఉద్యోగిని పని ఉంది అంటూ హోటల్ కు పిలిచింది.  సహ ఉద్యోగిని  ఆమె పిలిచిన చోటుకి  వెళ్ళింది మహిళా. కానీ అక్కడికి వెళ్ళిన తరవాత మాత్రం ఆ మహిళ షాక్ అయింది.  మహిళ చేత కూల్ డ్రింక్ తాగించి  ఆమె స్పృహ తప్పి పడిపోయిన తరువాత మరికొంత మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని మొత్తం వీడియో తీశారు. ఇక స్పృహలోకి వచ్చిన తర్వాత తనకు జరిగిన విషయం తెలిసి ఒక్కసారిగా బోరున ఏడ్చేసింది సదరు మహిళ.

 ఇక ఈ విషయం ఎవరికైనా బయట చెబితే వీడియోలను లీక్ చేస్తామంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ఆ వీడియో అడ్డంపెట్టుకుని ఆమెపై కొంతమంది పలుమార్లు అత్యాచారం చేయడం మొదలుపెట్టారు. ఇక 2020లో ఈ ఘటన జరుగగా.. ఇన్నాళ్ల పాటు వారి టార్చర్ భావిస్తూ వచ్చిన బాధితురాలు చివరికి వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించి జరిగిన దారుణాన్ని వెల్లడించింది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళలతో సహా ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ఐపీసీ లోని పలు సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది..

మరింత సమాచారం తెలుసుకోండి: