ఇటీవల కాలంలో మనుషులు మానవ బంధాలకు అసలు విలువ ఇవ్వడం లేదు. క్షణకాల సుఖం కోసం చేయకూడని దారుణమైన పనులన్నీ చేస్తూ ఉన్నారు. దీంతో సభ్య సమాజంలో బ్రతుకుతున్నది మనుషులా లేకపోతే అడవిలో జీవించే జంతువులా అన్నది కూడా అర్థం కాని విధంగా మారింది పరిస్థితి. ఎందుకంటే వావి వరసలు మరిచి పోతున్న ఎంతోమంది దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.. మానవ బంధాలకు విలువ ఇవ్వకుండా అక్రమ సంబంధాలకు తెర లేపుతూ ఎన్నో నీచమైన పనులు చేస్తూ ఉన్నారు.



 ఇక నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చుట్టూ ఉంటే సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడింది  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఓ మహిళతో యువకుడు సహజీవనం చేయడం మొదలుపెట్టాడు. అయితే సదరు మహిళకు అప్పటికే పెళ్ళయ్ కూతురు కూడా ఉంది  ఎన్నో రోజుల పాటు మహిళతో సహజీవనం చేస్తూ వస్తున్న అతని కన్ను చివరికి ఆ మహిళ కూతురు పై పడింది. దీంతో ఇక తల్లితోపాటు కూతురు పైన కూడా మాయమాటలతో లొంగదీసుకుని అత్యాచారం చేయడం మొదలుపెట్టాడు. ఈ ఘటన కాస్త ఇటీవలే బయటపడటంతో సంచలనంగా మారిపోయింది.


 మచిలీపట్నం లో వెలుగు లోకి వచ్చింది ఈ దారుణ ఘటన. ఓ మహిళతో సహజీవనం చేస్తున్న సురేష్ అనే వ్యక్తి ఆమె కూతురు పైన కొన్ని నెలలుగా అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. అయితే ఇటీవలే బాలిక గర్భం దాల్చింది  దీంతో అసలు విషయం వెలుగు లోకి వచ్చింది  దీంతో బాలిక బంధువులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు అన్నది తెలుస్తుంది. బాధిత బాలిక వయస్సు 17 ఏళ్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: