ఈ మధ్య అక్రమ సంబంధాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు ఇలాంటి సంభంధాలకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. భర్త వుండగానే మరో వ్యక్తి తో అక్రమ సంబంధం పెట్టుకొని పచ్చని కాపురాలను నాశనం చెసుకుంటున్నారు.ఈ మధ్య ఇలాంటి ఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. భర్తకు తెలియకుండా వేరొకరి తో సంబంధం పెట్టుకొని ప్రాణాలను పోగొట్టుకున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా మరో ఘటన వెలుగు లోకి వచ్చింది. ఓ వివాహిత భర్తకు తెలియకుండా తన స్నేహితుడుతో అక్రమ సంబంధం పెట్టుకుంది అది భర్తకు తెలియడం తో రెడ్ హేండెడ్ గా పట్టుకున్నాడు.


వివరాల్లొకి వెళితే.. ములుగు జిల్లా లోని దొడ్ల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న చీమల సుమలత, చర్ల కార్యదర్శి గా పనిచేసే పాయం పురుషోత్తం ప్రేమించుకున్నారు. గత 8 ఏళ్ల క్రితం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగాల రిత్యా సుమలత చిన్న బోయినపల్లిలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటుండగా.. పురుషోత్తం చర్లలో ఉంటున్నాడు. ఇద్దరు దూరంగా ఉండటంతో అనుమానం అనే బీజమ్ ఏర్పడింది. అయితే భార్య ప్రవర్తన సరిగ్గా లేదు.దాంతో అతను పంచాయితీ పెట్టింఛాడు.


ఆ సమయంలో సుమలత తల్లి సూటిపోటి మాటలతో పురుషోత్తంని నిందించి, అనుమానం కాదు అవసరమైతే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని నిరూపించాలని సూచించింది. పురుషొత్తం భార్యపై నిఘా పెట్టి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నర్సాపూర్‌ లోని ఓ ఇంట్లో సుమలత, లింగరాజు తో కలిసి ఉండగా రెడ్‌హ్యాండెడ్‌ గా పట్టుకున్నాడు. ఆ తర్వాత గ్రామ పెద్దలు, సుమలత కుటుంబ సభ్యుల సమక్షంలో నే వారిని పోలీసులకు అప్పగించిన్నట్లు భర్త పురుషోత్తం తెలిపారు. అతను చేసిన పనికి అందరు అభినందించారు.. ప్రేమించి పెళ్ళి చేసుకుంటే తనని దారుణం గా మోసం చేసిందని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. తనకూ న్యాయం చేయాలనీ కోరాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: