
ఈ విషయం ఎవరో చెప్పడం కాదు ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు చేసే పని తీరు చూసిన తర్వాత అందరికీ అర్థమవుతుంది. అందుకే ప్రభుత్వ ఉద్యోగం దేవుని పనిగా మెల్లిగా అయినా చేసుకోవచ్చు భావిస్తూ ఉంటారు ఎంతోమంది. ఈ క్రమంలోనే కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు అలసత్వం కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. అతను ఒక ప్రభుత్వ ఉద్యోగం లో కొనసాగుతున్నాడూ. కానీ పని వదిలేసి ఫుల్ గా తాగి రోడ్డుమీద పడిపోయాడు. ఈ ఘటన బెలగావి జిల్లా లోని తాలూకా తాసిల్దార్ కార్యాలయంలో వెలుగులోకి వచ్చింది.
సంజు బెన్ని అనే వ్యక్తి గొరవంకొల్ల గ్రామ విలేజ్ అకౌంటెంట్ గా కొనసాగుతున్నాడు. అయితే విధులకు సరిగా హాజరు అవ్వకుండా ఫుల్లుగా మద్యం తాగుతూ ఎప్పుడు కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. దీంతో అతన్ని అక్కడి నుంచి వేరే తాలూకా కు మార్చారు. అయినప్పటికీ అతని తీరులో మాత్రం మార్పు రాలేదు. తాగిన మత్తులో ప్రజలతో అనుచితంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇటీవలే విధులకు హాజరైనట్లు రిజిస్టర్లో సంతకం చేసి ఇక ఫుల్గా మద్యం తాగి వాహనాలు పార్కింగ్ చేసే చోట పడిపోయాడు. ఇది చూసి అక్కడికి వచ్చిన జనాలు మొత్తం షాక్ అయ్యారు అని చెప్పాలి. ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు తహసీల్దార్ ను డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం..