యువతీ యువకుల మధ్య ప్రేమ పుట్టడం అనేది సర్వసాధారణం. ఎన్నో ఏళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన జంటలు కొంతమంది పెళ్లి చేసుకుంటే మరికొంతమంది విడిపోతూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు కేవలం అబ్బాయి చేతిలో మోసపోయిన అమ్మాయిలు మాత్రమే చూశాము. పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడంటూ  ఏకంగా ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేసిన అమ్మాయిలను కూడా చూశాము. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ప్రియుడు పెళ్లి చేసుకుంటాను అని చెప్పినందుకు యువతి అతని దారుణంగా హత్య చేసిన ఘటన మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది అని చెప్పాలి.


 ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది.. మనం పెళ్లి చేసుకుని ఆనందంగా జీవిద్దాం అంటూ చెప్పిన యువకుడిని కుటుంబ సభ్యులతో కలిసి యువతి దారుణంగా హతమార్చింది.  బాధితుడి మృతదేహాన్ని ఊరి చివర బావిలో పడేసింది ప్రియురాలు. బౌధన్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంచలన మారిపోయింది. దినేష్, కుమారీ అనే ఇద్దరు యువతీ యువకులు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇక దినేష్ తన ప్రియురాలి తోనే జీవితం మొత్తం ఊహించుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడు.


 ఇంతలో కుమారి తల్లిదండ్రులు వేరే వ్యక్తితో ఆమెకు వివాహం నిశ్చయించారు. విషయం తెలుసుకున్న దినేష్ తనను పెళ్లి చేసుకోవాలంటూ కుమారి పై ఒత్తిడి తీసుకు వచ్చాడు. దీంతో ప్రియుడి పై కోపం పెంచుకున్న యువతి అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకుంది. మామయ్యతో కలిసి హత్యకు ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే  మాట్లాడాలంటూ దినేష్ ను పిలిచి చివరికి దారుణంగా హత్య చేసి ఊరి చివర బావిలో పడేసింది. దినేష్ కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు పలు వివరాలు సేకరించి కుమారి కుటుంబ సభ్యులను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది..

మరింత సమాచారం తెలుసుకోండి: