ఇటీవలే నగరానికి వచ్చినా భార్య భర్త పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లయిన 25 ఏళ్ల తర్వాత భర్త గురించి భార్య ఫిర్యాదు చేయడం మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. 25 ఏళ్ల నుంచి తన భర్త కారణంగా మనోవేదనకు గురవుతున్నా అంటూ పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు మహిళా. పెళ్లయిన మొదటి రోజు నుంచే ఇక ఎంతగానో మనోవేదనను భరిస్తూ వచ్చాను అంటూ తెలిపింది. ఇక పిల్లలు పుట్టిన తర్వాత అది అలవాటుగా మార్చుకున్నా అంటూ చెప్పుకొచ్చింది. తొందరపడి నిర్ణయం తీసుకొని అటు విడాకులు తీసుకోవాలి అనుకోకుండా ఇక పిల్లల కోసం దాంపత్య బంధాన్ని కొనసాగిస్తూ వచ్చినట్లు సదరు మహిళ చెప్పడం గమనార్హం. ఇలా ఇరవై ఐదేళ్ల వరకు వేచి చూసి పిల్లలు పెరిగి పెద్ద వాళ్ళు అయ్యి ప్రయోజకులు అయిన తర్వాత ఇక ఇప్పుడు నరకం నుంచి బయటపడాలని నిర్ణయానికి తీసుకుంది.
ఈ క్రమంలోనే నేరుగా అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇక ఇలా భార్య ఫిర్యాదు నేపథ్యంలో ఇక భర్తను కూడా పిలిచిన పోలీసులు ఇద్దరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే అప్పటికీ కాని తాను భార్యను హింసిస్తున్నాను అన్న విషయాన్ని భర్త తెలుసుకోలేకపోయాడు అని చెప్పాలి. తనపై భార్య ఫిర్యాదు చేసింది అన్న విషయాన్ని కూడా నమ్మలేకపోయాడు. ఒక్క ఛాన్స్ ఇస్తే మారతాను అంటూ జీవిత భాగస్వామిని పోలీసుల ముందే వేడుకున్నాడు. కానీ సదరు వివాహిత మనసు మాత్రం కరగలేదు. ఇక తాను ఎలాంటి వేధింపులు భరించలేని ఒంటరిగా ఉండడానికి ఇష్ట పడుతున్నాను అంటూ పోలీసులకు చెప్పింది.. మరికొన్ని రోజుల్లో విడాకులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు కూడా చెప్పడం గమనార్హం..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి