అడగందే అమ్మ అయినా పెట్టదు అని అంటూ ఉంటారు. కానీ అడగకుండానే వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా కష్ట కాలంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. గుడిలో పూజలు అందుకునే దేవుడు వరాలు ఇస్తాడో లేదో తెలియదు కానీ ఏకంగా నల్లకోటు వేసుకుని మన మధ్య తిరిగే వైద్యులు మాత్రం ఎంతోమందికి  కరోనా వైరస్ సమయంలో పునర్జన్మను ప్రసాదించారు అని చెప్పాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా తమ ప్రాణం పోతుందని కుటుంబం రోడ్డున పడుతోంది అని తెలిసినప్పటికీ కూడా కరోనా కష్టకాలంలో ప్రజల ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా ముందుకు కదిలారు.



 ఇక కరోనా సమయంలో వైద్యులు చేసిన త్యాగానికి వారిపై అందరికీ మరింత గౌరవం పెరిగిపోయింది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో కొంత మంది వైద్యులు మాత్రం వైద్య వృత్తికే కళంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రాణం పోయాల్సిన వైద్యులే ప్రాణం పోవడానికి కారణం అవుతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. వృద్ధ మహిళలకు డాక్టర్లు ఆపరేషన్ చేసారు. కానీ ఆ తర్వాత కుట్లు వేయడం మరచిపోయారు. ఈ ఘటన యశ్వంతపుర మండలంలోని దావనగెరి లో వెలుగులోకి వచ్చింది.


 ఇటీవలే 66 ఏళ్ల అన్నపూర్ణమ్మ కడుపు నొప్పి రావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. ఈ క్రమంలోనే  వైద్యులు పరీక్షలు చేసి ఆపరేషన్ చేశారు. ఇలా ఆపరేషన్ చేయడానికి కోసిన చోట కుట్లు వేయకుండా వదిలేసారు. ఇక ఆ తర్వాత వృద్ధురాలు తీవ్రమైన నొప్పితో బాధ పడింది. గమనించిన వైద్యులు వృద్ధురాలికి ఏదో సాకు చెబుతూ వచ్చారు. అయితే ఆపరేషన్ చేసి 15 రోజులు అవుతుంది. ఇప్పుడు వరకు గాయం మాన లేదని... లేవలేని స్థితిలో ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. డాక్టర్ అడిగినంత ఫీజులు చెల్లించిన నిర్లక్ష్యంగా వ్యవహ రించారు అంటూ ఆరోపించింది. చివరికి ఆమెను జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి: