ఇటీవలి కాలంలో డాక్టర్ల దగ్గరికి వస్తున్న విచిత్రమైన కేసులు ఏకంగా డాక్టర్ లనే  అవాక్కయ్యేలా చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న ఏకంగా ఒక వ్యక్తి కడుపులో స్టీల్ గ్లాస్ బయటపడటం అవాక్కయ్యేలా చేసింది. మద్యం తాగిన మత్తులో తన స్నేహితులే  మలద్వారం ద్వారా చొప్పించారు అని  అతను సమాధానం చెప్పడం మరింత అవాక్కయ్యేలా చేసింది. ఇప్పుడు ఇలాంటి  ఘటన వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 సదరు వ్యక్తికి పుట్టినప్పటినుంచి మెంటల్ బాలెన్స్ సరిగ్గా లేదు. మాట్లాడలేదు చెవులు కూడా సరిగ్గా వినపడవు.  ఇక చిన్నప్పటినుంచి అలాగే బ్రతుకుతూ వస్తున్నాడు. కానీ ఇటీవలే కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చింది.  దీంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తీసుకు వెళ్లి టెస్టులు చేయించారు. టెస్టు రిపోర్టులు చూసి డాక్టర్లు సైతం షాక్ అయ్యారు.   అతని పొట్ట లో అనేక రకాల పదార్థాలు ఉండటం చూసి డాక్టర్లు సైతం  నిర్ఘాంతపోయారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రోగి  బాధను అర్థం చేసుకున్న వైద్యులు వెంటనే ఆపరేషన్ నిర్వహించి కడుపు నుంచి రెండు కోన్ లు,  15 క్లాసిక్ స్ట్రా లు,  62 చెక్క ముక్కలు రిమూవ్ చేశారు.

 ఈ ఘటన గుజరాత్లోని వీరవల్ లో వెలుగు  లోకి వచ్చింది అని చెప్పాలి. అర్జున్ అనే 40 ఏళ్ల వ్యక్తికి  పుట్టుకతోనే మానసిక సమస్య తో పుట్టాడు.  ఫ్యామిలీ మెంబర్స్ అతను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవారు. గత కొంత కాలం నుంచి తరచూ కడుపు నొప్పి వస్తుండడం తో ఆస్పత్రికి తీసుకెళ్లగా అతనికి సిటి స్కాన్ చేసి చూశారు. దీంతో కడుపులో వ్యర్థాలు ఉన్నట్లు గమనించి వాటిని  ఆపరేషన్ చేసి  బయటకు తీశారు. సరైన అవగాహన లేక బాధితుడు వాటిని తిని  ఉంటాడని వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: