ఇటీవల కాలంలో ప్రభుత్వాలు అటు ప్రజలకు చెబుతున్న మాటలు ఒట్టి అబద్ధాలే అన్నది నిరూపించే ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఎందుకంటే తమదీ పేదలకు అండగా నిలిచే ప్రభుత్వం అంటూ ఎంతోమంది చెబుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే పేదలకు అధునాతన  టెక్నాలజీతో కూడిన వైద్యాన్ని అందించేందుకు ఇక ప్రభుత్వ ఆసుపత్రిలోనే అన్ని రకాల సదుపాయాలను అందుబాటులో ఉంచుతున్నామని చెబుతున్నారు. ఏకంగా కార్పోరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతున్నాం అంటూ  ప్రసంగాలు ఇస్తూనే ఉన్నారు.


 ఇక ప్రజా ప్రతినిధులు చెప్పింది నిజమే అనుకొని ప్రజలు నమ్మి ప్రభుత్వాసుపత్రులకు వెళ్తే మాత్రం అక్కడ పరిస్థితి మరోలా ఉంది అని చెప్పాలి. కనీస వస్తువు లేక చివరికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ఆస్పత్రిలో డాక్టర్లు అందుబాటులో లేకుండా పోతే ఇంకొన్ని ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో ఉన్న వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాల మీదికి తెస్తున్నారు. ఇంకొన్ని ఆసుపత్రుల్లో అయితే ఏకంగా పాములు ఎలుకలు లాంటివి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే పేషంట్లకు ప్రాణ సంకటంగా మారిపోతున్నాయి అని చెప్పాలి. వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది.


 ఏకంగా ఎంజీఎం ఆసుపత్రి లో ఎలుకలు బెడద ఎక్కువగా ఉందని పేషెంట్లు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఎలుకలు మాత్రమే కాదు ఇక పాములు కూడా కలకాలం సృష్టిస్తున్నాయి. పేషెంట్లను వైద్య సిబ్బందిని భయాందోళనకు గురిచేస్తున్నాయి అని చెప్పాలి. సరిగా పది రోజుల క్రితం క్యాన్సర్ వార్డులోని బాత్రూంలోకి చొరబడిన నాగుపాము తాజాగా వార్డులోకి వచ్చింది. ఒక పేషంట్ బెడ్ కిందకి వచ్చేసింది అని చెప్పాలి. గమనించిన పేషంట్ ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. ఇక ఆస్పత్రి సిబ్బంది వెంటనే స్నేక్ క్యాచర్కు సమాచారం అందించి.. ఇక నాగుపామును పట్టుకున్నారు. ఈ ఘటన సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: