వెరసి నేటి రోజుల్లో వెలుగులోకి వచ్చిన ఘటనలు చూసిన తర్వాత ఎప్పుడు ఎటువైపు నుంచి మృత్యువు ముంచుకొస్తుందో అని అనుక్షణం భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా అయితే భార్యాభర్తల బంధం లో ఇలాంటి ఇలాంటి దారుణాలు ఎక్కువైపోయాయి. కలకాలం ఒకరికి ఒకరు తోడునీడగా కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు.. చిన్న చిన్న కారణాలకే ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటీవలే త్రిపురలో కూడా ఇలాంటి దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఒక వ్యక్తి ఏకంగా 15 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్నాడు. అతనికి పెళ్ళై 8 నెలలు అవుతుంది. అయితే ఇలా వివాహ వయస్సు రాని బాలికను పెళ్లి చేసుకోవడమే పెద్ద తప్పు. ఇక ఈ తప్పు చాలదు అన్నట్టు అతను మరో దారుణమైన తప్పు చేశాడు. ఏకంగా 15 ఏళ్ల భార్యను దారుణంగా హత మార్చాడు. తల మొండెం వేరు చేసి అడవిలో పడేసారు. దీంతో తమ కూతురు తనుజ బేగం కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అడవిలో శరీర భాగాలను గుర్తించారు. నిందితుడు ఖయ్యుమ్ మియాను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ హత్యకు గల కారణాలు ఏంటి అనే విషయంపై విచారణ చేస్తున్నారు పోలీసులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి