
అవును, ఓ యువకుడు చేసిన ప్రమాదకరమైన స్టంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ కావడం మనం గమనించవచ్చు. నేషనల్ హైవేపై రన్నింగ్‌లో ఉన్న లారీ క్యాబిన్ ముందు అంటే అద్దం కింద ఉండే బంపర్‌పై నిలబడి మనోడు వీడియోలకు ఫోజులివ్వడం ఇందులో స్పష్టంగా చూడవచ్చు. వీడియోలో రికార్డైన ప్రదేశాన్ని బట్టి ఈ ఘటన కౌశాంబి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోఖ్రాజ్ ప్రాంతంలోని టోల్ ప్లాజా దగ్గర జరిగినట్లుగా అర్ధం చేసుకోవచ్చు. లారీ కదులుతుండగానే ముందు అంటే అద్దం కింద ఉండే బంపర్‌పై నిలబడి ఎదురుగా వస్తున్న వాహనాలకు,పక్కన వెళ్తున్న వాహనాలను చూస్తూ పోజులిచ్చాడు ఆ ప్రబుద్దుడు.
ఈ స్టంట్ చేస్తున్న సమయంలో కొందరు ఆ యువకుడ్ని ఓ పక్కనుండి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. కాగా వైరల్ అవుతున్న ఆ డేంజర్ వీడియో చివరకు పోలీసులకు చేరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఓ అవధేష్ విశ్వకర్మ తెలిపారు. హైవేపై ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్ చేసిన యువకుడి కోసం గాలిస్తున్నామని అతడ్ని పట్టుకున్న తర్వాత తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పుకొచ్చారు.