టీచర్ తిట్టిందని కొంత మంది.. తక్కువ మార్కులు వచ్చాయని మరి కొంత మంది.. తల్లిదండ్రులు మందలించారని.. అడిగింది కొనివ్వలేదని ఇంకొంత మంది ఇలా చిన్నచిన్న కారణాలకే ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు అని చెప్పాలి. ఇక అటు భార్యాభర్తల బంధం లో కూడా ఆత్మహత్య అనేది నేటి రోజుల్లో సర్వసాధారణంగా మారింది. భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్నపాటి గొడవలకే మనస్తాపం చెంది ఎంతోమంది క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ జీవితాన్ని ముగిస్తున్నారు. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే.
భార్య భర్తల మధ్య గొడవలు జరగడం కామన్.. ఇలా గొడవలు జరిగినప్పుడు భార్య అలిగి పుట్టింటికి వెళ్లడం కూడా కామన్. ఇలా భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు బతిమాలి ఇంటికి తీసుకు రావడం మానేసి ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు
భార్య పుట్టింటికి వెళ్ళింది అన్న కారణంతో మనస్థాపం చెందిన భర్త.. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా రాజపల్లి లో చోటుచేసుకుంది. తుడుం ప్రశాంత్ అనే 28 ఏళ్ల యువకుడు ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో గొడవలు జరిగే భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో ప్రశాంత్ మనస్థాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి