ఇటీవల కాలంలో ట్రైన్ యాక్సిడెంట్లకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయని చెప్పాలి. అయితే ట్రైన్ లో ప్రయాణించేటప్పుడు అటు ప్రయాణికులు.. ఎప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన.. చివరికి ట్రైన్ పట్టాల కింద పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక ఆర్టీసీ బస్సు రన్నింగ్ లో ఉన్నప్పుడు దిగినట్లుగానే అటు ట్రైన్ ముందుకు కదులుతున్న సమయంలో ఎంతోమంది ట్రైన్ ఎక్కడం లేదా దిగడం లాంటివి చేస్తూ ఉంటారు.


 ఇక ఇలాంటివి చేసే కొంతమంది చివరికి ప్రమాదాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వరకు ట్రైన్ లో ప్రయాణించిన ఎంతో మంది ప్రయాణికులు.. ఇలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించి ప్రమాదం బారిన పడటం గురించి విన్నాము. కానీ ఇక్కడ ఒక అధికారి ఏకంగా తనను తానే ప్రమాదంలో పెట్టుకున్నాడు. అదృష్టం కలిసి వచ్చి చివరికి ప్రాణాలతో బయటపడ్డాడు అని చెప్పాలి. ఏకంగా వందే భారత్ ట్రైన్ లోకి ఎక్కే ప్రయత్నంలో డోర్లు మూసుకుపోవడంతో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది.


 గుజరాత్ నుంచి వందే భారత్ రైలు ముంబైకి వెళుతుంది. ఈ క్రమంలోనే అహ్మదాబాద్ వద్ద ఆగింది రైలు. అయితే అక్కడే ఉన్న చెకింగ్ అధికారి రైలులోకి ఎక్కడం కాస్త ఆలస్యమైంది. ఇక అంతలోనే రైలు మళ్లీ కదలడం మొదలుపెట్టింది. అయితే ఇక రైలు వెంట పరిగెట్టిన అధికారి ట్రైన్ లోకి ఎక్కే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే డోర్లు మూసుకున్నాయి. ఈ క్రమంలోనే ఆ అధికారి కింద పడిపోయాడు. అయితే కాస్తలో రైలు కింద పడే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు అని చెప్పాలి. అయితే ఫ్లాట్ ఫామ్ మీద ఉన్న ప్రయాణికులు ఆయన్ని పైకీ లాగడంతో చివరికి ప్రాణాలతో బయటపడగలిగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: