ఇలాంటి ఘటనల గురించి తెలిసిన తర్వాత ఇంకోసారి రెస్టారెంట్ కు వెళ్లి ఫుడ్ తినకూడదు అని చాలామంది ఫిక్స్ అవుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. ఈ ఘటన గురించి తెలిస్తే మాత్రం మరోసారి రెస్టారెంట్లో చికెన్ ఆర్డర్ చేయరు. ఓ కస్టమర్ కి ఇలాంటి చేదు అనుభవం తెలిస్తే యాక్ అంటారు. సాధారణంగా రెస్టారెంట్ కు వెళ్ళినప్పుడు తమకు ఇష్టమైన చికెన్ కర్రీని ఆర్డర్ చేసుకోవడం చాలా మంది కస్టమర్లు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక కస్టమర్ కూడా ఇలాంటిదే చేశాడు. వెయిటర్ ని పిలిచి తనకు నచ్చిన చికెన్ కర్రీ ఆర్డర్ చేశారు. తర్వాత ఆకలిగా ఉన్న ఆ కస్టమర్ ఇక తనకు ఇష్టమైన కర్రీతో ఒక పట్టు పట్టాలి అనుకున్నాడు.అంతలో ఊహించని షాక్.
ఏకంగా చికెన్ కర్రీ లో ఎలుక కనిపించింది. చికెన్ ముక్క అయి ఉంటుందని ఇంకా నోట్లో వేసుకుందాం అనుకున్నాడు. కస్టమర్కు ఒక్కసారిగా ఉలిక్కిపడినంత పని అయింది. చికెన్ కర్రీ లో ఎలుక వచ్చింది. అయితే ఈ విషయం సిబ్బందికి చెప్పగా.. తప్పు తమది కాదు అన్నట్లుగా మాట్లాడారు. ఈ క్రమంలోనే కస్టమర్కి హోటల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. అతను చేసిన ఆరోపణలు మాత్రం రెస్టారెంట్ యాజమాన్యం తోసిపొచ్చింది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి