అయితే ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో చూడడానికి బాగానే ఉంటాయి. కానీ రియల్ లైఫ్ లో మాత్రం మరింత భయంకరంగా ఉంటాయి అని చెప్పాలి. ఇక సినిమాలను చూసిన ఎంతోమంది ప్రేక్షకులు రియల్ లైఫ్ లో కూడా ఇలా రాత్రి సమయంలో ఏవైనా వింత శబ్దాలు వినిపించాయి అంటే చాలు నిజంగా సినిమాల్లో చూపించినట్లుగా దయ్యాలు ఉన్నాయేమో అని భావిస్తూ భయంతో వనికి పోతూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ కొంతమంది వ్యక్తులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఊరు దగ్గరలో ఉన్న మామిడి తోటలో వింత శబ్దాలు వినిపించాయి. అయితే స్థానికులు కాస్త ధైర్యం చేసి ఏం జరిగి ఉంటుందా అని ఇక తోటలోకి వెళ్లి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఈ ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఊరికి దగ్గరలో ఉన్న మామిడి తోటలో ఒక క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఏకంగా ఐదు కార్లతో 20 మంది వ్యక్తులు దేవత విగ్రహాలు తెచ్చి ఇక మనిషి ఆకారంలో ముగ్గులు వేసి క్షుద్ర పూజలు నిర్వహించడం మొదలుపెట్టారు. అచ్చం సినిమా సెట్టింగ్ ను తలపించేలా ఇక వారు చేసిన పూజలు చుట్టుపక్కల అందరిని కూడా భయభ్రాంతులకు గురిచేశాయి. ఇలా మామిడి తోటలోకి వచ్చిన నెంబర్ ప్లేట్లకు అటు తెలంగాణ తమిళనాడుకు చెందిన నెంబర్లు ఉన్నాయని గుర్తించారు. స్థానికులు రావడాన్ని గుర్తించి ఇక వెంటనే కార్లల్లో వారందరూ కూడా పరారయ్యారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి