మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషుల్లో జాలి దయ అనే గుణం రోజు రోజుకి కనుమరుగైపోతుందా.. ముక్కు ముఖం తెలియని వారి విషయంలో కూడా అయ్యో పాపం అంటూ జాలి పడే మనిషి ఇక ఇప్పుడు ఏకంగా సాటి మనిషి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదా అంటే వెలుగులోకి వచ్చే ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు అవును అనే సమాధానమే చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకే ఏకంగా ఉన్మాదులుగా మారిపోతున్న మనుషులు సాటి మనుషులు ప్రాణాలను దారుణంగా గాల్లో కలిపేస్తూ ఉన్నారు.


 ఇంత చిన్న కారణానికి కూడా ప్రాణాలు తీస్తారా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది అని చెప్పాలి. ఇక ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ఎప్పుడు ఎవరు దాడి చేసి ప్రాణాలను తీసేస్తారో అనే భయం కూడా ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే చాక్లెట్ తిననంత ఈజీగా మనిషి ప్రాణాలను తీయగలుగుతున్నాడు సాటి మనిషి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన గురించి తెలిస్తే.. అయితే ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటారు. ఇంత చిన్న కారణానికి కూడా ప్రాణాలు తీస్తున్నారంటే.. మనుషుల్లో రాక్షసత్వం బాగా పెరిగిపోయిందేమో అనే భావన ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది అని చెప్పాలి.


 సాధారణంగా ఫోన్ మాట్లాడేటప్పుడు కొంతమంది లౌడ్ స్పీకర్ పెట్టుకుని మాట్లాడటం చేస్తూ ఉంటారు. ఇక్కడ అలా లౌడ్ స్పీకర్ పెట్టుకోవడమే ఒక ప్రాణం పోవడానికి కారణమైంది. విశాఖ జిల్లా రామవరానికి చెందిన బంగార్రాజు ఇంటి ముందు రోడ్డుపై లౌడ్ స్పీకర్ ఆన్ చేసి ఫోన్ మాట్లాడుతున్నాడు. అయితే అదే సమయంలో అజయ్ అనే యువకుడు ఫోన్ మాట్లాడుతూ అటువైపుగా వచ్చాడు. ఇక తనకు డిస్టర్బ్ అవుతుందని నెమ్మదిగా మాట్లాడమంటూ బంగార్రాజును అజయ్ హెచ్చరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే అదే సమయంలో బంగార్రాజు మామ దేవుడు బయటకు వచ్చి అజయ్ వాగ్వాదానికి దిగగా కోపంతో ఊగిపోయిన అజయ్ అతనిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: