ఇక ఈ మూవీలో స్టోరీ ప్రతి ఒక్కరికి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి నుంచి ఒకరిని లవ్ చేయడం. కాలేజీకి వెళ్లిన తర్వాత మరొక్కరితో డేటింగ్ లో మునిగి తేలడం చేస్తూ ఉంటుంది. ఇక వీరిద్దరికి విషయం తెలుసుకోవడంతో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేస్తుంది. ఇక ఇప్పుడు ఏక అచ్చం బేబీ సినిమాను తలపించేలా హైదరాబాద్ నగరంలో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది అయితే ఇక్కడ యువతి కాదు యువకుడు ఇలా ఇద్దరితో ప్రేమాయణం సాగించాడు. ఒకరితో సహజీవనం చేస్తూనే మరొకరితో ప్రేమ గీమ అంటూ తిరగడం మొదలుపెట్టారు. అయితే ఈ విషయం ఇద్దరు ప్రియురాల్లకు తెలిసిపోయింది.
చివరికి వారు ఇతనితో పెళ్లికి నిరాకరించడంతో మరణమే శరణ్యం అనుకోని చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. కర్నూలుకు చెందిన శివప్రసాద్ అనే 23 ఏళ్ల యువకుడు.. ఫిలింనగర్ లోని దుర్గ భవాని నగర్ బస్తీలో ఇల్లు అద్దెకు తీసుకొని మరో యువతీతో కలిసి ఉంటున్నాడు. అయితే అక్కడ ఉంటూనే ఉపాధి కోసం బంజారాహిల్స్ లో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. అయితే అదే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న యువతిపై ప్రేమ అంటూ వెంట పడటంతో ఆమె ఇతనీ ప్రేమను అంగీకరించింది. అయితే అప్పటికే అతను మరొకరితో సహజీవనం చేస్తున్నాడు అయితే చివరికి విషయం ఇద్దరికీ తెలిసిపోయింది. దీంతో యువకుడు తో పెళ్లికి ఇద్దరు కూడా నిరాకరించారు. దీంతో మన స్థాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి