అయితే ఎంత పెద్ద సమస్య వచ్చినా ఆత్మహత్య చేసుకోవడం అనేది మహాపాపం. కానీ ఇటీవల కాలంలో జనాలు మాత్రం చిన్న చిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతూ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి ఇలా క్షణికావేషంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా చివరికి కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు ఎంతోమంది. సమస్య ఏదైనా సరే ధైర్యంగా ఎదిరించి పోరాడి నిలబడాలి అన్న తత్వాన్ని పూర్తిగా మరిచిపోయి విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇటీవలే మధ్యప్రదేశ్లో కూడా ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి.
మధ్యప్రదేశ్లో ఒక వ్యక్తి హోటల్ నడుపుతున్నాడు. అయితే ఉన్నట్టుండి అతను రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయాడు. అయితే 2016లో ఆ వ్యక్తి స్వీయ రక్షణ కోసం లైసెన్సుడు రివాల్వర్ తీసుకున్నాడు. అయితే పోలీసులకు దీనికి సంబంధించి సమాచారం అందడంతో అక్కడికి వచ్చి రక్తపు మడుగులో ఉన్న అతని వద్ద నుంచి ఏడు పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ సూసైడ్ నోట్లో అతను రాసింది చూసే ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. నేను 8, 9 ఏళ్ల ముందే 30ఏళ్ల వరకే బతకాలనుకున్నాను. ఇప్పుడు నాకు 30 వచ్చేసాయి. అందుకే చనిపోతున్నాను. నాకు ఎలాంటి కష్టాలు బాధలు లేవు. నా చావుకు ఎవరు కారణం కాదు అంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి