
ఈ క్రమంలోనే వెలుగులోకి వచ్చే ఘటనలు కొన్ని ప్రతి ఒక్కరిని కూడా ముక్కున వేలేసుకునేలా చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో మానవ బంధాలకు విలువ ఇవ్వని మనుషులు.. అక్రమ సంబంధాల పేరుతో క్షణకాల సుఖం కోసం చేయకూడదని నీచమైన పనులన్నీ చేసేస్తూ ఉన్నారు. వెరసి ఇక ఇలాంటి బంధాలు చివరికి ప్రాణాలు పోవడానికి కారణాలుగా మారిపోతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ఏకంగా మర్మాంగాన్ని భాగస్వామి గట్టిగా బిగబట్టి నొక్కడంతో.. చివరికి వ్యక్తి మృతి చెందిన ఘటన ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేసింది.
ఈ ఘటన రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. బార్మర్లో ఇది జరిగింది. మలరామ్ అనే వ్యక్తికి పెళ్లయింది. అయితే రెండేళ్ల క్రితం అనారోగ్యంతో అతని భార్య చనిపోయింది. అయితే కొంతకాలం క్రితమే అతని తమ్ముడు కూడా చనిపోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒకవైపు మలరామ్ మరోవైపు తమ్ముడు భార్య పావని కూడా ఒంటరిగానే ఉన్నారు. దీంతో ఇద్దరు సహజీవనం చేయడం మొదలుపెట్టారు. అయితే అంతా సాఫిగా ఉంది అనుకుంటున్న సమయంలో వీరిద్దరి మధ్య ఇటీవల వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన పావని మలరామ్ మర్మాంగాన్ని గట్టిగా నొక్కడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.