భార్య భర్తల బంధం అయితే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఒకసారి మూడుముళ్ల బంధంతో ముడి పడిన తర్వాత విడదీయడం ఎవరి తరము కాదు. అయితే పెళ్లి జరిగిన తర్వాత ప్రతి భార్య కూడా తన భర్త తనకే సొంతం అని అనుకుంటూ ఉంటుంది. కనీసం పరాయి మహిళ చూపు తన భర్త మీద పడినా కూడా అసలు సహించలేదు. ఎవరైనా తన భర్తను కాస్త విచిత్రంగా చూశారు అంటే వారికి వార్నింగ్ ఇవ్వడం లాంటిది కూడా చేస్తూ ఉంటుంది అని చెప్పాలి.


 కానీ ఇక్కడ ఇద్దరు యువకులు మాత్రం పెళ్లి చేసుకున్న భర్తలనే పంచుకునేందుకు సిద్ధమయ్యారు. సాధారణంగా అయితే స్నేహితులు అన్న తర్వాత ఫుడ్ షేర్ చేసుకోవడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఇద్దరు మాత్రం ఏకంగా కట్టుకున్న భర్తని నాలుగేళ్ల పాటు షేర్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. నాలుగేళ్ల పాటు ఈ బంధం సజావుగాని సాగింది. కానీ చివరికి ఓ యువతి భర్త వివాహేతర బంధం లో ఉన్న మహిళను పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. ఈ ఘటన సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. బెహ్రెయిన్ కు చెందిన యువతకి 2019లో వివాహం జరిగింది. ఇద్దరు ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.


 అయితే నాలుగేళ్ల క్రితం ఓ సారి తన భర్తతో కలిసి స్నేహితురాలు ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో స్నేహితురాలి భర్త కూడా అక్కడే ఉన్నారు. నలుగురు కలిసి సరదాగా గడిపారు. క్రమంగా వీరి మధ్య సానిహిత్యం పెరిగింది. అయితే ఈ రెండు జంటలు క్రిస్మస్ వేడుకను కలిపి జరుపుకున్నాయ్. అయితే స్నేహితురాలు ఇద్దరు కూడా తమ భర్తలను మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. పరస్పర అంగీకారంతో ఇక ఈ బంధం నాలుగేళ్లు సజావుగానే సాగింది. అయితే యువతి భర్త తన భార్య స్నేహితురాలితో ప్రేమలో పడ్డాడు. ఇది కాస్త అతని భార్యకు తెల్సింది. ఈ విషయంపై భర్తను స్నేహితురాలని ప్రశ్నించింది. దీంతో రెండు జంటల మధ్య గొడవలు జరగగా.. విడాకులు తీసుకోకుండా తన భర్త మరో మహిళల వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు అని బెహ్రెయిన్ యువతి ఆరోపించింది. అతనిపై కేసు కూడా పెట్టింది. అయితే ఇక ఈ విషయంపై విచారణ జరిపిన లక్నో ఫ్యామిలీ కోర్టు  ఇద్దరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: