ఇటీవల కాలం లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు. అయితే కామాంధులను శిక్షించేందుకు ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకువచ్చినప్పటికీ ఇక మృగాళ్లలా మారిపోతున్న మనుషుల తెలుగులో మాత్రం అసలు మార్పు రావడం లేదు. కళ్ళ ముందు ఆడపిల్ల కనిపించింది అంటే చాలు మగాళ్లు మృగాలుగా మారిపోయి దారుణంగా వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయ్. ఇక ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.


 ఆడపిల్లలుగా పుట్టడమే మేం చేసిన పాపమా అని ప్రతి ఒక్కరు కూడా బాధపడిపోతున్నారు. దీంతో కామపు కోరల్లో చిక్కుకోకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఎక్కడికి వెళ్ళినా వేధింపులు మాత్రం తప్పడం లేదు. ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి ఓ దారున ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా 16 ఏళ్ల బాలుడు ఒక వివాహేతపై అత్యాచారానికి పాల్పడిన ఘటనతో ఏకంగా స్థానికులు అందరూ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. భీమవరం మండలంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన మహిళపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.


 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళ ఉదయం సమయంలో బహిర్భూమికి వెళ్ళగా బాలుడు ఆమెపై అత్యాచారానికి ఒడి కట్టాడు. అయితే బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సదరు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు..  గతంలో బాల నేరస్తుడిగా కూడా ఉన్నాడు అని పోలీసు రికార్డుల్లో బయటపడండి. అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు పోలీసులు. అయితే ఇలాంటి నీచులను కఠినంగా శిక్షించాలని ఉరి శిక్ష వేయాలని స్థానికులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: