పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన గట్టం అన్న విషయం తెలిసిందే. నచ్చిన భాగస్వామిని  జీవితంలోకి ఆహ్వానించి ఇక జీవితాంతం వారితోనే సుఖసంతోషాలను పంచుకోవాలని అనుకుంటూ ఉంటారు యువతీ, యువకులు. ఈ క్రమంలోనే కోటి ఆశలతో వైవాహిక బంధంలోకి అడుగుపెడుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం పెళ్లి అనేది కేవలం కమర్షియల్ ఎలిమెంట్ గా మాత్రమే మారిపోయింది. ఇక పెళ్లి చేసుకుంటే కట్నం ఎక్కువ రావాలని అబ్బాయిలు.. బాగా సంపాదించే అబ్బాయి  భర్తగా రావాలని అమ్మాయిలు కాస్త కమర్షియల్ గానే ఆలోచిస్తున్నారు.


 అయితే ఇటీవల కాలంలో అటు వరుడు కుటుంబ సభ్యులు అడుగుతున్న కట్న కానుకలు కూడా కళ్ళుభైర్లు కమ్మే విధంగా ఉంటున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా భారీగా కట్నం అడుగుతూ వధువు కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నేటి రోజుల్లో కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునే వారు ఎవరైనా ఉంటారు అంటే అలాంటి వారు కనిపించడం కష్టమే అని చెబుతూ ఉంటారు అందరు. అయితే రాజకీయ నాయకుల పిల్లల పెళ్లిళ్లు అయితే ఇంకెంత ఘనంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కట్న కానుకలు కూడా భారీగానే ముట్ట చెప్పాల్సి ఉంటుంది.


 కానీ ఇక్కడొక రాజకీయ నాయకుడు మాత్రం కేవలం ఒకే ఒక్క రూపాయి కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నాడు. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కుమారుడి వివాహానికి ఇలా కేవలం ఒక్క రూపాయి కట్నం తీసుకొని.. ఆదర్శంగా నిలిచాడు బిజెపి నేత. హర్యానాలో ఈ ఘటన జరిగింది. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ చౌకర్ కుమారుడు.. గౌరవ్ కి హర్యానా ఎస్ఎస్సి చైర్మన్ భూపాల్ సింగ్ కుమార్తెతో వివాహం జరిగింది. అయితే పెళ్లి వేడుక సమయంలో కట్నం ఇస్తుండగా అందులో నుంచి కేవలం ఒకే ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నారు కృష్ణ చౌకర్. వరకట్న వ్యవస్థను తొలగిస్తేనే ఆడ మగ మధ్య ఉన్న వివక్ష పోతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: