ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే నేటి సభ్య సమాజంలో  బ్రతుకుతుంది మనుషులా.. లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాలా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఏకంగా ఆడపిల్ల కళ్ళెదుట  కనిపించింది అంటే చాలు మగాళ్లు మృగాలుగా మారిపోయి దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దీంతో ఇక ఎంతో ధైర్యంగా ఉద్యోగమో వ్యాపారం చేసుకొని సొంత కాళ్లపై బ్రతకాలి అనుకున్న ఆడపిల్లను కామపు కోరలు వెనక్కి లాగుతూనే ఉన్నాయి. ఇక వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే ఆడపిల్ల ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.


 అయితే నేటి రోజుల్లో ఆడపిల్లకు అటు ఇంట్లో కూడా రక్షణ లేని పరిస్థితి నెలకొంది అన్న విషయం తెలిసిందే. బయట ఆకతాయిల నుంచి ఎదురైన ఇబ్బందులను ఇంట్లో చెప్పుకుందామన్న ఏకంగా ఇంట్లోనే కంటికి రెప్పల కాచుకోవాల్సిన తండ్రి.. కష్టాల్లో అండగా ఉండాల్సిన అన్న కామందులుగా మారిపోయి దారుణంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆడపిల్ల జీవితం మరింత దుర్భరంగా మారిపోతూ ఉంది. ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా కన్నా కూతురిపైనే అత్యాచారం చేసిన తండ్రికి కోర్టు కఠిన శిక్ష విధించింది.


 హైదరాబాద్ నగరంలోని తాడ్ బంద్ లో కూతురుపై అత్యాచారం చేసిన వ్యక్తికి ఏకంగా 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ 12వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి తీర్పునిచ్చారు. రామావత్ రమేష్ అనే 30 ఏళ్ల వ్యక్తి రెండో భార్యతో పాటు మొదటి కూతురైన 13 ఏళ్ల బాలికతో ఉంటున్నాడు. అయితే 2022 మార్చ్ 16వ తేదీన ఏకంగా సొంత కూతురిపైనే రమేష్ అత్యాచారం చేస్తూ ఉండడంతో పిన తల్లి చూసింది. దీంతో వెంటనే బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరచగా ఇక కోర్టు అతనికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: