జీవితం అనేది కేవలం నాటకం మాత్రమే. ఆ నాటకానికి కర్త క్రియ కర్మ అన్ని కూడా ఆ దేవుడే అని చెబుతూ ఉంటారు పెద్దలు. ఎందుకంటే దేవుడు ఆడే నాటకంలో మనుషులు కేవలం కీలుబొమ్మల్లాంటి వాళ్ళు మాత్రమే. ఇక అతను ఎలా ఆడిస్తే అలా ఆడుతూ ఉంటారు. కానీ అంతా మనమే చేస్తున్నామని అనుకుంటూ ఉంటారు. అయితే ఇదంతా నిజమే అనేదానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. అప్పటివరకు అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని ఘటనలు కొన్ని కొన్ని సార్లు మనుషుల ప్రాణాలను తీసేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.


 ఏకంగా ఊహించని రీతిలో ప్రాణాలు గాల్లో కలిసిపోయే ఘటనలు అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. అక్కడ జరిగింది నిజమేనా కాదా అని అర్థం చేసుకోవడానికి కూడా చాలా సమయం పడుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇలా ఎన్నో అనూహ్య ఘటనలు మనుషుల ప్రాణాలు గాల్లో కనిపిస్తాయి అన్నదానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు  వెలుగులోకి వచ్చాయి. అయితే ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కొవలోకి చెందినదే. సాధారణంగా ఎంతో మంది ఆడవాళ్లు ఇక వడియాలు ఆరబెట్టడం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఓ మహిళ కూడా వడియాలు ఆరబెడదామని టెర్రస్ పైకి వెళ్ళింది.


 అలా వెళ్లడమే తన మరణానికి కారణమవుతుంది అని మాత్రం ఊహించలేకపోయింది. ఏకంగా టెర్రస్ పైకి వెళ్ళిన మహిళా చివరికి జారీ కింద పడింది. దీంతో తీవ్ర గాయాల పాలైన మహిళ చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన  హైదరాబాద్ నగరంలోని తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహీంద్రా హిల్స్ త్రిమూర్తి కాలనీ నివాసి అయిన వరలక్ష్మి రెండంతస్తుల భవనం టెర్రస్ పైకి వెళ్లారు. ఒడియాలు ఆరబెడుతుండగా కాలు జారి కింద పడటంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. కాగా భర్త సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: