తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా ఏకంగా గృహ జ్యోతి అనే పథకాన్ని ప్రవేశ పెట్టింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 200 యూనిట్ల కరెంటును ఉచితం గా అందించేందుకు నిర్ణయించింది. ఇలా ఎన్నికల ముందు ఇచ్చిన హామీల లో భాగం గా ఇలా గృహ జ్యోతి పథకాన్ని ప్రకటించింది అని చెప్పాలి. ఈ క్రమం లోనే ఇక ఈ పథకానికి సంబంధించిన మార్గ దర్శకాలు కూడా ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ఫ్రీ కరెంటుకు అర్హులుగా ఉన్నారో.. ఇక ఆయా వినియోగదారులకు మార్గదర్శకాలను జారీ చేసింది ప్రభుత్వం. అయితే ఇక ఇప్పుడు గృహ జ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా కరెంటు వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమం లోనె రానున్న రోజుల్లో మరిన్ని ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అటు విద్యుత్ అధికారులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే గృహ జ్యోతి పథకం లో 200 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా ఉపయోగించుకునేందుకు అవకాశం ఉండగా.. ఇష్టం వచ్చినట్లుగా వాడితే కష్టాలు తప్పవు అన్నది తెలుస్తుంది.


 ప్రభుత్వం గృహ జ్యోతి పథకం ద్వారా అందిస్తున్న 200 యూనిట్ల ఫ్రీ కరెంటును కేవలం గృహ వినియోగానికి మాత్రమే ఉపయోగించుకోవాలని మార్గదర్శకాలను జారీ చేసింది. ఇంటి అవసరాలు మినహా ఇతర అవసరాలకు వాడుకోవద్దు అంటూ స్పష్టం చేసింది. కమర్షియల్ అవసరాలకు కరెంటు వాడుకుంటే విద్యుత్ చట్టం 2003 ఇండియన్ పీనల్ కోడ్ కింద కేసులు నమోదు చేస్తాము అంటూ తెలిపింది. అయితే అద్దె ఇంట్లో ఉన్నవారికి కూడా ఈ స్కీం వర్తిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: