తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అధికారాన్ని చేపట్టిన వెంటనే అటు మహాలక్ష్మి అనే పతకాన్ని ప్రారంభించి ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. ఇక ఇప్పుడు ఏకంగా గ్యాస్ సిలిండర్ ధర విషయంలో ఇక కరెంట్ బిల్లు విషయంలో కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చింది. గృహజ్యోతి, గృహలక్ష్మి పథకాలను ప్రవేశపెట్టింది.


 ఈ క్రమంలోనే గృహ జ్యోతి పథకంలో భాగంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ అందించేందుకు నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ పథకాన్ని అమలు చేసింది. ఇక వచ్చే నెల నుంచి ఈ పథకం పూర్తిస్థాయిలో అమలవుతుంది అని చెప్పాలి. అయితే ఇక ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకం ద్వారా అటు విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఏకంగా ప్రభుత్వ 200 యూనిట్ల వరకు కరెంటును ఉచితంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే మొన్నటి వరకుఇంట్లో కరెంటుని ఎంతో జాగ్రత్తగా వాడుకుంటూ కేవలం 100 యూనిట్లవరకు మాత్రమే వాడకం చేసిన వారు ఇక ఎప్పుడూ ఎలాగో ఫ్రీ ఉంది కాబట్టి 200  యూనిట్లు వాడేస్తే పోలా అని అనుకునే ఛాన్స్ లేకపోలేదు. ఈ క్రమంలోనే గృహ జ్యోతి పథకం ద్వారా విద్యుత్ వినియోగం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారట. ఇక దీని కారణంగా రానున్న రోజుల్లో విద్యుత్ కి మరింత డిమాండ్ పెరుగుతుందని విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారట అధికారులు. అయితే ఈ ఫ్రీ కరెంట్ పథకం ద్వారా కరెంటు కోతలు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఇలాంటి అంతరాయం జరగకుండా ఉండాలి అంటే రానున్న రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ల సంఖ్యను పెంచాలి అని అభిప్రాయపడుతున్నారట. అయితే గృహ జ్యోతి పథకంలో కరెంట్ కోతలు ఏర్పడితే ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలు చేపట్టే అవకాశం లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: