నేటి సభ్య సమాజంలో మనుషుల తీరు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఈ ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటూ సభ్య సమాజంలో గౌరవంగా బ్రతకాలని అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు ఎదుటివారిని బురిడీ కొట్టించి అందిన వాడికి దోచుకుని ఇక సభ్య సమాజంలో జల్సా విషయాలని అనుకుంటూ ఉంటున్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా మనుషులు చాలామంది కనిపిస్తున్నారు. ఇప్పటికే మాయమాటలతో మోసం చేస్తూ ఖాతాలు కాలు చేస్తున్న సైబర్ నేరగాళ్ల నుంచి అటు జనాలు కాస్త అప్రమత్తంగానే ఉంటున్నారు.  కానీ మంచి వాళ్ళ ముసుగులో ఉంటూ జానాలను బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్ల నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నారు అని చెప్పాలి.


 ఇలాంటి తరహా ఘటనల గురించి తెలిసిన తర్వాత ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి నేటి రోజుల్లో నెలకొంది  ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటిదే చేశాడు  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అవి 250 మందికి పైగా మహిళలను మోసం చేశాడు. చివరికి ఇక ఇతని గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా అవాక్కవుతున్నారు అని చెప్పాలి . ఏకంగా కస్టమ్స్ ఆఫీసర్గా అవతారమెత్తిన కేటుగాడు ఇలా మహిళలను మోసం చేయడమే టార్గెట్గా పెట్టుకున్నాడు. చివరికి మాయమాటలు చెప్పి డబ్బులు గుంజడం మొదలుపెట్టాడు. దీంతో ఇక అతన్ని నమ్మి డబ్బులు ఇచ్చినా ఎంతో మంది బాధితులు న్యాయం చేయాలంటూ పోలీసులు ఆశ్రయించగా ఇక పోలీసులు చివరికి ఇతనిపై నిఘా పెట్టి అరెస్టు చేశారు.


 ఈ ఘటన రాజస్థాన్లో వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ కు చెందిన నరేష్ అనే 45 ఏళ్ల వ్యక్తి కస్టమ్స్ ఆఫీసర్ అవతారం ఎత్తాడు. కొన్నేళ్లుగా బెంగళూరులోనే నివసిస్తున్నాడు. అయితే అతడు మ్యాట్రిమోనీ వెబ్సైట్, వివాహ ప్రకటనల్లో కనిపించిన మహిళల నెంబర్లకు ఫోన్లు చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే కస్టమ్స్ ఆఫీసర్ అని నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తూ అందరిని మాయమాటలతో నమ్మించేవాడు. పెళ్లి చేసుకుంటాను అంటూ ముగ్గులోకి దింపేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల  ఒక బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో అతని వ్యవహారం కాస్త బయటపడింది. ఇక అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. ఇప్పటివరకు 250 మందికి పైగా మహిళలను మోసంచేసినట్లు పోలీస్ విచారణలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: